Leading News Portal in Telugu

SMS Alert: మీకు వచ్చిన ఎస్‌ఎంఎస్ చివర ఉన్న S, P, G, T అక్షరాల అర్థం తెలుసా?


SMS Alert: ఇదివరకు వచ్చే మెసేజ్లు, ప్రస్తుతం వస్తున్న మెసేజ్లకు చాలా తేడా ఉందని మీరు గమనించారా? అవునండి.. ఇదివరకు పోలిస్తే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయన్న సంగతి తెలిసిందే కదా.. కేంద్ర ప్రభుత్వం ఈ సైబర్ నేరాలకు చెక్కుపెట్టే దిశగా కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని వ్యాపార సంబంధిత కంపెనీలు చేసే అడ్వర్టైజ్మెంట్లు, ప్రభుత్వం నుంచి వచ్చే సందేశాలు, ఇంకా మిగతా అవసరాలకు సంబంధించిన ఆధారంగా ఎస్ఎంఎస్ (SMS)లు వస్తున్నాయి. అయితే, ఇందులో ఏది నిజమో..? ఏది అబద్దమో..? అని నిర్ధారించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెసేజ్ లు ద్రువీకరించవచ్చంటే..

PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోడీ

ప్రస్తుతం మన మొబైల్‌ ఫోనుకు వస్తున్న SMS అడ్రస్‌ చివర S, G, T, P వంటి అక్షరాలను గమనించారా? అవి ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా.. నిజానికి సైబర్ నేరాలను అరికట్టేందుకు SMSలు పంపే సంస్థలు ట్రాయ్‌ డీఎల్‌టీ (TRAI DLT) వ్యవస్థ ద్వారా ముందుగా నమోదవ్వాలి. ఇలా మాత్రమే అధీకృతంగా, నిర్ధారిత రీతిలో SMS పంపడం సాధ్యమవుతుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు మోసపూరిత సందేశాలు రావడం తగ్గుతుంది.

Gold Rate Today: శాంతించిన బంగారం ధరలు.. లక్షన్నరకు చేరువలో వెండి ధర

SMS అడ్రస్‌లో ఉండే S, P, G, T అక్షరాల అర్థం ఏంటంటే..
S (Service Messages):
సేవలకు సంబంధించిన సందేశాలు. ఉదాహరణకు: బ్యాంక్ అలర్ట్‌లు, ఓటీపీలు (OTP), ముఖ్య సమాచారం వంటివి.

P (Promotional Messages):
ప్రకటనల సమాచారం. మార్కెటింగ్, ఆఫర్లు, సేల్స్, కొత్త ప్రొడక్ట్ ప్రకటనలు వంటి సందేశాలు.

G (Government Messages):
ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సందేశాలు. ఆధార్ ఓటీపీ, EPFO, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన సందేశాలు.

T (Transactional Messages):
ఆర్డర్ కన్ఫర్మేషన్‌లు, బిల్లు చెల్లింపు, షిప్పింగ్ అప్డేట్లు, ట్రాన్సాక్షన్ సమాచారం వంటి సందేశాలు.