Leading News Portal in Telugu

Samsung Galaxy Buds3 FE Launched in India with ANC, Real-Time Translation and More


Samsung Galaxy Buds3 FE: శాంసంగ్ తన సరికొత్త వైర్‌ లెస్ ఇయర్‌బడ్స్ గెలాక్సీ బడ్స్3 ఎఫ్‌ఈ (Samsung Galaxy Buds3 FE)ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, మంచి ఆడియో సిస్టమ్‌తో ఈ బడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. గెలాక్సీ బడ్స్3 ఎఫ్‌ఈ పెద్ద స్పీకర్‌తో మంచి ఆడియోను అందిస్తుంది. ఇది బాస్, ట్రెబుల్‌ను సరైన లెవెల్ లో అందించగలదు. అసలైన ఆడియో అనుభవం కోసం ఇందులో ఎన్‌హాన్స్‌డ్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్ ఉంది. ఇది చుట్టుపక్కల వచ్చే అనవసరపు శబ్దాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో కాల్స్ కోసం.. క్రిస్టల్ క్లియర్ కాల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మెషిన్ లెర్నింగ్ మోడల్ సహాయంతో వినియోగదారుల వాయిస్‌ను వేరు చేసి, శబ్దం ఉన్న వాతావరణంలో కూడా స్పష్టమైన సంభాషణలను నిర్ధారిస్తుంది.

SMS Alert: మీకు వచ్చిన ఎస్‌ఎంఎస్ చివర ఉన్న S, P, G, T అక్షరాల అర్థం తెలుసా?

Image (4)

ఈ బడ్స్‌లో గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. కనెక్ట్ చేయబడిన స్మార్ట్‌ఫోన్‌లో గెలాక్సీ ఏఐ ఇంటర్‌ప్రెటర్ యాప్ ద్వారా రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ చేయవచ్చు. దీంతో విదేశీ భాషా ఉపన్యాసాలు వినడం లేదా ఇతర భాషలో సంభాషణలు సాగించడం సులభం అవుతుంది. “హేయ్ గూగుల్” వంటి వాయిస్ కమాండ్‌ లతో చేతులు లేకుండానే అవసరమైన పనులను నిర్వహించుకోవచ్చు. గెలాక్సీ బడ్స్3 ఎఫ్‌ఈ బ్లేడ్ డిజైన్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఇది మాట్ డ్యుయల్ టోన్ ఫినిష్, సెమీ ట్రాన్స్‌పరెంట్ యాక్సెంట్స్‌తో వస్తుంది.

ENG vs SA: టీ20లో 300+ స్కోర్.. ఏంటి భయ్యా ఆ కొట్టుడు.. ఫిల్ సాల్ట్ దెబ్బకు దక్షిణాఫ్రికా ఫ్యూజులు అవుట్!

ఇక బ్లేడ్ మీద పించ్ అండ్ స్వైప్ సిస్టమ్ ద్వారా వాల్యూమ్, ఇతర ఆప్షన్స్‌ను నియంత్రించవచ్చు. ఈ బడ్స్ శాంసంగ్ గెలాక్సీ ఎకోసిస్టమ్‌తో సజావుగా అనుసంధానించబడతాయి. ఆటో స్విచ్ ఫీచర్ ఆడియో యాక్టివిటీని గుర్తించి, డివైజ్‌ల మధ్య కనెక్షన్‌ను ఆటోమేటిక్‌గా మారుస్తుంది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్3 ఎఫ్‌ఈ ధర రూ. 12,999. వచ్చే వారం నుండి భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు కొన్ని ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ లతో కలిపి కొనుగోలు చేస్తే రూ. 4,000 విలువైన ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌ బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ లబిస్తుంది. అంతేకాకుండా 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది.

Image (3)