Flipkart, Amazon Sale Deals: ఈ సంవత్సరం అతిపెద్ద సేల్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండింటిలోనూ రాబోతోంది. ఈ సేల్ సెప్టెంబర్ 22వ తేదీన అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ సేల్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, మనం ఈ సేల్‌లో దాదాపు సగం ధరకే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో కేవలం రూ. 70,000 కు, 16 ప్రో మాక్స్ దాదాపు రూ.90,000 కు లభిస్తున్నాయి. మరి ఆరబోయే ఈ సేల్‌లో లభించే ఐదు ఉత్తమ ఫ్లాగ్షిప్ డీల్స్ గురించి తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ S24:
ఈ సేల్‌లో మనం శాంసంగ్ గెలాక్సీ S24ను కొనుగోలు చేయవచ్చు. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 83 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ మొబైల్ 6.1 అంగుళాల AMOLED డిస్ప్లే, అల్యూమినియం ఫ్రేమ్, IP68 రేటింగ్‌తో ఉత్తమ ఆండ్రాయిడ్ అనుభవాన్ని పొందవచ్చు. మీరు ఆ బడ్జెట్లో చూస్తున్నట్లయితే నాన్ అల్ట్రా వేరియంట్‌ను కూడా లిస్ట్ లో చేర్చవచ్చు.
Hydra: శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. రూ.500 కోట్ల విలువ
ఐఫోన్ 16 ప్రో సిరీస్:
మీరు ఐఫోన్‌ను చూస్తున్నట్లయితే, సాధారణంగా మనకు లాస్ట్ జనరేషన్ ఫోన్లపై ఆఫర్లు వస్తాయి. ఐఫోన్ 17 ప్రారంభమైనందున, 16 సిరీస్ మంచి ధరకు లభించే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో ఇప్పుడు కొనడానికి చాలా మంచి విలువను అందిస్తుంది. ఎందుకంటే, ఇది ఐఫోన్ 17 కంటే కేవలం రూ.7,000 అదనంగా ఖర్చు అవుతుంది. ఐఫోన్ 17 కంటే ఇది ఎందుకు మెరుగైనదంటే, ఇది పూర్తిగా టైటానియం బాడీ, ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, శక్తివంతమైన A18 ప్రో చిప్‌తో వస్తుంది. మీకు పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే కావాలంటే ప్రో మాక్స్ కోసం వెళ్లవచ్చు. ఇది దాదాపు రూ. 90,000 వద్ద లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా:
శాంసంగ్ S25 అల్ట్రా కూడా రూ.90,000 బడ్జెట్ సెగ్మెంట్లో లభించే అవకాశం ఉంది. క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఎల్పీడీడీఆర్5 ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 టెక్నాలజీ, 200 MP కెమెరాలతో ఇది అద్భుతమైన ఎంపిక. మీకు ఐఓఎస్ వద్దు, ఆండ్రాయిడ్ కావాలంటే 16 ప్రో మాక్స్‌కు బదులుగా దీన్ని ప్లాన్ చేయవచ్చు.
నథింగ్ ఫోన్ (3a):
నథింగ్ ఫోన్ 3 అధిక ధరతో లాంచ్ అయిందన్న విష్యం తెలిసిందే. కానీ.. ఈ బిగ్ బిలియన్ డే సేల్‌లో మీరు దానిని సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి, దీని ధర 40,000-45,000 మధ్య ఉండవచ్చు. ఇందులో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, అల్యూమినియం ఫ్రేమ్, 5100mAh బ్యాటరీ ఉన్నాయి.
Tirupati : తిరుపతిలో అదృశ్యమైన పింక్ డైమండ్ రహస్యం వీడింది
గూగుల్ పిక్సెల్ 9:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో ఎక్కువగా గుర్తుకు వచ్చేవి గూగుల్ పిక్సెల్ ఫోన్లు. ఈసారి కూడా, గూగుల్ పిక్సెల్ 9 దాదాపు రూ.40,000 కు లభిస్తుంది. ఇందులో 6.99 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. గూగుల్ సంబంధించిన టెన్సర్ ఫోర్స్ చిప్ కొద్దిగా వేడెక్కే అవకాశం ఉంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ డీల్స్‌లో మీకు ఇంకా మంచి ఆఫర్లు కావాలంటే.. రియల్మీ GT సిరీస్, మరికొన్ని 13 సిరీస్‌లపై కూడా మంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది. మీరు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు.