Leading News Portal in Telugu

Vizag Hands: AP MedTech Zone Launches Bionic Arms for Differently-Abled in Visakhapatnam


  • మెడెక్ జోన్లో ‘వైజాగ్ హ్యాండ్’
  • కృత్రిమ చేతుల తయారీ ప్రారంభం
  • దివ్యాంగుల కోసం ఇతర పరికరాలు కూడా..

విశాఖపట్నంలోని ఏపీ మెడెక్ జోన్లో కొత్తగా దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు.
పూర్తివివరాల్లోకి వెళితే. ఏపీ మెడెక్ జోన్లో దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు. కాలు లేని దివ్యాంగులకు ‘జైపూర్ ఫుట్’ ఎలాగో చేతులు లేని వారికి ‘వైజాగ్ హ్యాండ్’ అలా పనిచేస్తుందని సీఈఓ జితేంద్రశర్మ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు.

విశాఖప ట్నంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ మహిళ చేయిని కోల్పోయింది. దీంతో ఆమెకు మయో ఎలక్ట్రిక్ ప్రోస్థటిక్ హ్యాండ్ తయారుచేసి అమర్చామని తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కాళ్లు, చేతులతో పాటు సోలార్ తో పనిచేసే వీల్ చైర్లను కూడా రూపొందిస్తున్నామని జితేంద్ర శర్మ వెల్లడించారు.