Social Media Reels Addiction: ఈమధ్య కాలంలో మనలో చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. ఒక్క రీల్ చూద్దామని ఫోన్ తీసుకొని గంటల తరబడి స్క్రోల్ చేస్తన్నారు. ఈ అలవాటు వ్యసనంలా మారిపోవడం ద్వారా.. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మనం తెలుసుకుందాం. ఈ మధ్య రీల్స్ చూడటం చాలా మందిలో ఒక వ్యసనంగా మారిపోయింది. రీల్స్ చూస్తే మెదడులో డోపీన్ అనే ఫీల్ గుడ్ రసాయనం విడుదలవుతుంది. ఇది మద్యం తాగడం, స్మోకింగ్ చేయడం లాంటి ఇతర వ్యసనాల సమయాల్లో కూడా వస్తుంది. ఈ ఆనందం మనల్ని మళ్లీ మళ్లీ రీల్స్ చూడమని ప్రేరేపిస్తుంది. దానితో అది చివరికి అది ఒక వ్యసనంలా మారుతుంది.
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 6.67 అంగుళాల HD+ లతో కేవలం రూ.10499లకే Realme P3 Lite 5G లాంచ్!
అలాగే ఫోన్ స్క్రీన్ లో ఉండే బ్లూ లైట్ మెదడుని డే టైం లో ఉన్నట్టు భ్రమపడేలా చేస్తుంది. దీనివల్ల నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ తగ్గి నిద్రపోవడం కూడా కష్టమవుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గంట స్క్రీన్ తో గడిపితే నిద్రలేమి అంటే ఇన్సోమనియా వచ్చే అవకాశం 60% పెరుగుతుంది. సోషల్ మీడియా మెదడును చురుకుగా ఉంచి నిద్రకు సిద్ధమవడం కష్టం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
OG : ఓజీలో కత్తిలాంటి మరో హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే..
ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పరిమితులు అవసరం. డిజిటల్ డీటాక్స్ తో బ్రేకులు తీసుకోవడం, నిద్రకు ముందు స్క్రీన్ టైం తగ్గించడం, సోషల్ మీడియా మీ జీవితాన్ని లేదా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తే కౌన్సిలింగ్ అంటే సహాయం తీసుకోవడం అవసరం. ఈ వ్యసనం నుండి బయట పడడానికి మీ డాక్టర్ సలహా తీసుకోవడంలో ఏమాత్రం ఆలోచించకండి.