OPPO F31 Series: ఒప్పో (OPPO) తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ OPPO F31, F31 ప్రో, F31 ప్రో+ 5Gలను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు అబ్బురపరిచే ఫీచర్లతో, సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ సిరీస్ లో మూడు ఫోన్లలోనూ భారీ బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన థర్మల్ మేనేజ్మెంట్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఫోన్లు వేడిని తగ్గించడానికి పెద్ద వ్యాపర్ ఛాంబర్స్, థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉన్నాయి.
వీటిలో 7,000 mAh బ్యాటరీతో పాటు 80W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది కేవలం 30 నిమిషాల్లో 58% వరకు ఛార్జ్ చేయగలదు. బ్యాటరీ లైఫ్ ను పెంచడానికి గేమింగ్ లో నేరుగా ఫోన్ కు పవర్ అందించే ‘బైపాస్ ఛార్జింగ్’ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అంతేకాక ఈ ఫోన్లు 360° ఆర్మర్ బాడీతో రూపొందించబడ్డాయి. అలాగే డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ కోసం IP69, IP68, IP66 రేటింగ్ లను కలిగి ఉన్నాయి.
Nothing Offers: Flipkart Big Billion Days 2025లో నథింగ్ ఫోన్ 3a, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్‌పై భారీ ఆఫర్స్!
ప్రాసెసర్:
OPPO F31 Pro+: ఇది క్వాల్ కమ్ కు చెందిన స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది అడ్రినో 720 GPUను కలిగి ఉంది. ఈ ఫోన్ లో 5,219 mm² వ్యాపర్ ఛాంబర్ ఉంది. ఇది వేడిని సమర్థవంతంగా బయటకు పంపుతుంది.
OPPO F31 Pro: ఈ మోడల్ మొబైల్ మీడియాటెక్ కు చెందిన డైమెన్సిటీ 7300-ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో 4,363 mm² వ్యాపర్ ఛాంబర్, పెద్దగా ఉన్న గ్రాఫైట్ షీట్లు కలిగి ఉన్నాయి.
OPPO F31: ఈ ఫోన్ లో డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంది. దీనిలో 4,300 mm² వ్యాపర్ ఛాంబర్ ఉంది. ఇది ఇదివరకు మోడల్ కంటే 21% మెరుగైన థర్మల్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అన్ని మోడల్స్ లో నెట్ వర్క్ బూస్ట్ చిప్ N1 ఉంది. ఇది సిగ్నల్ ఇంటర్ఫరెన్స్ ను గుర్తించి, మంచి సిగ్నల్ స్ట్రెంగ్త్ ను అందిస్తుంది.
Flipkart Big Billion Days 2025: Motorola స్మార్ట్‌ఫోన్లు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌పై భారీ తగ్గింపు..!
సాఫ్ట్వేర్:
ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ OS 15తో పనిచేస్తాయి. వీటికి 2 సంవత్సరాల ఓఎస్ అప్ డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి. ముఖ్యంగా, ఇందులో ప్రొఫెషనల్స్ కు ఉపయోగపడే అనేక ఏఐ (AI) ఫీచర్లు ఉన్నాయి. ఏఐ వాయిస్ స్క్రైబ్ ద్వారా మీటింగులు, కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని 29 భాషలలోకి అనువదించగలదు. ఏఐ కాల్ అసిస్టెంట్ గూగుల్ జెమిని మోడల్ ను ఉపయోగించి కాల్స్ ను రియల్-టైమ్ లో అనువదిస్తుంది.
కెమెరాలు:
OPPO F31 Pro+: ఈ ఫోన్ లో 32MP ఫ్రంట్ కెమెరా, వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
OPPO F31 Pro: ఈ మోడల్ లో కూడా ఓఐఎస్ ఫీచర్ తో 50MP మెయిన్ కెమెరా ఉంది.
OPPO F31: ఇందులో 50MP మెయిన్ సెన్సార్, రెండు 2MP పోర్ట్రెయిట్ లెన్స్ లు, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఈ అన్ని ఫోన్లు 4K వీడియో రికార్డింగ్ కు మద్దతిస్తాయి.
ధరలు:
ఈ ఫోన్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. OPPO F31 8జీబీ+128జీబీ మోడల్ ధర రూ. 22,999 కాగా, 8జీబీ+256జీబీ మోడల్ ధర రూ. 24,999గా నిర్ణయించారు. అదేవిధంగా, OPPO F31 Pro మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ మోడల్ రూ. 26,999, 8జీబీ+256జీబీ మోడల్ రూ. 28,999, 12జీబీ+256జీబీ మోడల్ రూ. 30,999 కి లభిస్తాయి. ఇక, OPPO F31 Pro+ 8జీబీ+256జీబీ మోడల్ ధర రూ. 32,999, 12జీబీ+256జీబీ మోడల్ ధర రూ. 34,999గా నిర్ణయించారు. ఈ మొబైల్స్ సెప్టెంబర్ 27 నుండి అందుబవాటులోకి రానున్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా.. వినియోగదారులకు 10% ఇన్సటంట్ బ్యాంక్ డిస్కౌంట్, అలాగే రూ. 3,500 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం లభిస్తాయి.
It’s time to pre-order the #SmoothAndPowerful – OPPO F31 Series 5G ! Pick your perfect match: OPPO F31 5G starting at ₹22,999, OPPO F31 Pro 5G starting at ₹26,999, and OPPO F31 Pro+ 5G starting at ₹32,999.
Pre-Order Now: https://t.co/IH6aFLEpOq#OPPOF31Series5G pic.twitter.com/bM4x2oGMAO— OPPO India (@OPPOIndia) September 15, 2025