- అమెజాన్‌లో బంపర్ ఆఫర్స్
- సగం ధరకే గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ
- గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫీచర్స్ ఇవే
అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23 నుంచి సేల్ ప్రారంభమవుతోంది. ప్రైమ్ సబ్స్రైబర్లు ఒక రోజు ముందే సేల్ అందుబాటులోకి వస్తుంది. అయితే ‘సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ’పై ఆఫర్ కోసం మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫోన్ అమెజాన్‌లో అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. ఈ సామ్సంగ్ ఫోన్ గత సంవత్సరం భారతదేశంలో రూ.59,999కి రిలీజ్ అయింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లతో రూ.34,500 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.35,730గా ఉంది. ఇది లాంచ్ ధర కంటే చాలా తక్కువ. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.40,000కు లభిస్తుంది. మీరు మీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్ ధర రూ.34,500కు తగ్గుతుంది. అన్ని ఆఫర్ల అనంతరం ఈ ఫోన్ సగం ధరకే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.33,700 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.
గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫీచర్స్:
# 6.7 ఇంచెస్ డైనమిక్ ఎమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే
# 1080×2340 పిక్సెల్స్ రెజల్యూషన్
# క్సీనోస్ 2400ఇ ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 14
# 50 ఎంపీ మెయిన్ లెన్స్‌తో మూడు కెమెరాలు
# సెల్ఫీల కోసం 10ఎంపీ కెమెరా
# 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 డబ్ల్యూ ఛార్జింగ్ సామర్థ్యం