Leading News Portal in Telugu

Kodak Launches New QLED Google TVs in Matrix Series.. Available in 43, 50, 55, and 65 Inches


Kodak Matrix Series: కోడాక్ సంస్థ తమ మ్యాట్రిక్స్ సిరీస్‌లో కొత్తగా 43, 50, 55, 65 అంగుళాల QLED గూగుల్ టీవీలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు అద్భుతమైన సినిమా అనుభూతిని అందిస్తాయి. ఇక ఈ టీవీల ముఖ్యమైన ఫీచర్లను పరిశీలించినట్లయితే ఇందులో ఈ టీవీలు 4K QLED డిస్‌ప్లేతో వస్తాయి. ఇది ఒక బిలియన్ రంగులు, HDR10+, WCG (వైడ్ కలర్ గ్యామట్) వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది అత్యంత స్పష్టమైన, నాణ్యమైన దృశ్యాలను వీక్షకులకు అందిస్తుంది.

Kodak Matrix Series టీవీలు బెజల్ లెస్ మెటాలిక్ డిజైన్‌తో, ఈ టీవీలు మీ ఇంటికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఈ టీవీలలో క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ ఉన్నాయి. ఇది ఎలాంటి లాగ్ లేకుండా సున్నితమైన పనితీరును అందిస్తుంది. ఈ టీవీలు డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS ట్రూసరౌండ్ వంటి అధునాతన సౌండ్ టెక్నాలజీలను కలిగి ఉన్నాయి. 65 అంగుళాల మోడల్ 60W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తే, మిగిలిన మోడళ్లు 50W అవుట్‌పుట్‌ను అందిస్తాయి.

Hyderabad: చర్లపల్లి స్టేషన్‌లో మహిళా మృతదేహం.. ఎవరు ఆ మహిళ? హత్య చేసింది ఎవరు?

ఈ టీవీలలో గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 10,000+ యాప్‌లు, 500,000+ షోలకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇంకా ఈ టీవీలలో 3 HDMI పోర్ట్‌లు (ARC, CEC), 2 USB పోర్ట్‌లు, ఆప్టికల్ అవుట్‌పుట్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, మరియు బ్లూటూత్ 5.0 ఉన్నాయి. అలాగే ఫ్లాగ్‌షిప్ 65 అంగుళాల మోడల్‌లో AI స్మూత్ మోషన్ @ 60Hz వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధరలు:
65 అంగుళాల మోడల్ (65ST5035): రూ. 37,999

55 అంగుళాల మోడల్ (55ST5025): రూ. 27,649

50 అంగుళాల మోడల్ (50ST5015): రూ. 23,999

43 అంగుళాల మోడల్ (43ST5005): రూ. 18,799

Pakistan: ఛీ.. ఛీ.. ఆటే కాదు.. నిరసన చేయడం కూడా చేతకాదా? ఆసియా కప్ 2025లో హైడ్రామా!

ఈ టీవీలు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో రానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా.. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ & ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై 10% తగ్గింపుయాహూ పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% తగ్గింపు లభిస్తుంది.