Leading News Portal in Telugu

Ray-Ban Meta Gen 2 Launched with 3K Video, AI Features and Longer Battery


Ray-Ban Meta Gen 2: మెటా కనెక్ట్ 2025 ఈవెంట్‌లో రే-బాన్ మెటా జెన్ 2 లాంచ్ అయ్యింది. 2023లో విడుదలైన రే-బాన్ మెటాకు ఇది నెక్స్ట్ జెనరేషన్. ఈ కొత్త గ్లాసెస్ బ్యాటరీ, కెమెరాలో భారీ అప్‌గ్రేడ్‌లతో పాటు ఎక్కువ ఫ్రేమ్, రంగుల ఎంపికలతో వస్తాయి. ఈ గ్లాసెస్ ఇప్పుడు 3K రిజల్యూషన్‌లో వీడియోలు, ఫోటోలు తీయగలవు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) స్మార్ట్ గ్లాసెస్, మెటా రే-బాన్ డిస్‌ప్లే, క్రీడాకారుల కోసం రూపొందించిన వాన్‌గార్డ్ గ్లాసెస్‌తో పాటు పరిచయం చేశారు.

డిజైన్ పరంగా, రే-బాన్ మెటా జెన్ 2 ఇదివరకు వెర్షన్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు లేవు. కానీ ఫ్రేమ్, రంగుల ఎంపికలు పెరిగాయి. దీని ఓపెన్ ఇయర్ స్పీకర్లు ఇప్పుడు మరింత మెరుగ్గా ఉండి, శబ్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా స్పష్టమైన ఆడియోను అందిస్తాయి. ఐదు మైక్రోఫోన్‌ లు నాయిస్ రిడక్షన్ కోసం ఆప్టిమైజ్ చెయబడ్డాయి. దీని వల్ల వాయిస్, వీడియో కాల్స్ సమయంలో, మెటా AIతో మాట్లాడేటప్పుడు మరింత స్పష్టత లభిస్తుంది.

Tariff On India: అమెరికాకు తత్వం బోధపడింది.. భారత్‌పై 25% టారిఫ్ తగ్గించే ఛాన్స్..

అలాగే, అతిపెద్ద మార్పు బ్యాటరీ లైఫ్‌లో వచ్చింది. కంపెనీ ప్రకారం జెన్ 2 పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంతో సగటున ఎనిమిది గంటల వరకు ఉంటుంది. ఇది దాని ముందటి వెర్షన్ బ్యాటరీ లైఫ్‌కు దాదాపు రెట్టింపు. ఛార్జింగ్ కేస్ గ్లాసెస్‌ను కేవలం 20 నిమిషాల్లో సున్నా నుండి 50 శాతానికి ఛార్జ్ చేయగలదు. మరోవైపు కెమెరా కూడా భారీ అప్‌గ్రేడ్‌ను పొందింది. రే-బాన్ మెటా జెన్ 2 ఇప్పుడు మరింత సామర్థ్యం గల సెన్సార్‌తో 3K రిజల్యూషన్ వీడియోలను 30fps వద్ద మూడు నిమిషాల వరకు లేదా 60fps వద్ద 30 సెకన్ల పాటు రికార్డ్ చేయగలదు. ఫోటోలను 3,024 x 4,032p రిజల్యూషన్‌లోనే తీస్తుంది. స్లో మోషన్, హైపర్ లాప్స్ మోడ్‌లు కూడా AI గ్లాసెస్‌లో రాబుతున్నాయని మెటా తెలిపింది.

Image (2)

వీటితోపాటు కొన్ని కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు కూడా పరిచయం చేయబడ్డాయి. కొత్తగా ‘కన్వర్సేషన్ ఫోకస్’ ఫీచర్‌ను ఆవిష్కరించారు. ఇది శబ్దం ఉన్న చోట మనం మాట్లాడుతున్న వ్యక్తి గొంతును ఎక్కువగా వినిపించేలా చేస్తుంది. ఈ ఫీచర్ కొత్త గ్లాసెస్‌లో ప్రారంభం నుంచే అందుబాటులో ఉంటుంది. మరో ఫీచర్ లైవ్ ట్రాన్స్‌లేషన్ విస్తరణ. ఇది ఇప్పుడు జర్మన్, పోర్చుగీస్ భాషలకు కూడా సపోర్ట్ ఇస్తుంది. త్వరలో ఈ ఫ్లాగ్ షిప్ గ్లాసెస్ లో ఆరు భాషలలో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ విమాన ప్రయాణాల్లో కూడా లభిస్తుంది. అయితే, దీని కోసం వినియోగదారులు భాషా ప్యాక్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Pakistan-Saudi Pact: భారత్‌-పాక్ యుద్ధం జరిగితే, సౌదీ భారత్‌పై దాడి చేస్తుందా..? కొత్త ఒప్పందం ఏం చెబుతోంది.?

రే-బాన్ మెటా జెన్ 2 ధర $379 (రూ. 33,300) నుండి మొదలవుతుంది. ప్రస్తుతం ఇది ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ లతోపాటు ఇతర దేశాలలో ముందస్తు ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ వేఫరర్, స్కైలర్ లేదా హెడ్‌లైనర్ అనే మూడు ఫ్రేమ్ స్టైల్స్‌లో మొత్తం 27 రంగులు, ఫ్రేములు, లెన్స్ కాంబినేషన్లలో లభిస్తాయి. ఈ ఏడాది చివరిలో ఈ గ్లాసెస్ భారతదేశం, మెక్సికోలో విడుదల అవుతాయని కంపెనీ తెలిపింది. ఇక పోలరైజ్డ్ లెన్స్ గ్లాసెస్ ధర 409 డాలర్స్ కాగా, ట్రాన్సిషన్ లెన్స్‌లతో 459 డాలర్స్ ఖర్చవుతుంది. ఇంకా, కస్టమర్ ప్రిస్క్రిప్షన్ మోడల్‌ను ఎంచుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉంది.