Leading News Portal in Telugu

Honor Magic V8 Series Tipped with Dual 200MP Cameras.. Launch in Q4 2025


Honor Magic V8 series: హానర్ కంపెనీ నుండి త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా విషయంలో ఒక పెద్ద అప్‌గ్రేడ్ ఉండబోతోందని సమాచారం. ఒక టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. షెన్‌జెన్ ఆధారిత తయారీదారు (OEM) తన రాబోయే హానర్ మ్యాజిక్ V8 సిరీస్, హానర్ మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్‌లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చనుంది. హానర్ మ్యాజిక్ V8 శ్రేణిలోని ఒక హ్యాండ్‌సెట్, ప్రైమరీ కెమెరాతో పాటు 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.

ఓట్లు తొలగించేందుకు వ్యవస్థనే హైజాక్ చేస్తున్నారని ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ!

హానర్ మ్యాజిక్ 8 సిరీస్ 2025 నాలుగో త్రైమాసికంలో విడుదల కానుందని అంచనా. ఈ విషయమై హానర్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గువో రుయ్ మాట్లాడుతూ.. త్వరలో రాబోయే HonorMagic8 AI నేటివ్ స్మార్ట్‌ఫోన్ Q4లో అత్యంత చెప్పుకోతగ్గ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అవుతుందని ఆయన అన్నారు. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబో పోస్ట్ ప్రకారం.. హానర్ తన రాబోయే హ్యాండ్‌సెట్‌ల కోసం 200MP కెమెరాలను ఉపయోగించనుంది. దీని కోసం పెద్ద సంఖ్యలో సెన్సార్‌లను వెతికే క్రమంలో ఉంది. హానర్ ఏ సెన్సార్‌ను ఉపయోగించబోతోందనే వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, హానర్ మ్యాజిక్ V8 సిరీస్, మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్‌లు ఈ అప్‌గ్రేడ్‌ను పొందే అవకాశముందని లీకర్ పేర్కొన్నారు.

మ్యాజిక్ V8 సిరీస్‌లో 200MP ప్రధాన కెమెరా, 200MP టెలిఫోటో షూటర్ ఉంటాయని టిప్‌స్టర్ తెలిపింది. మ్యాజిక్ 8 సిరీస్‌లోని టాప్ వేరియంట్ అయిన హానర్ మ్యాజిక్ 8 అల్ట్రాలో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటుందని అంచనా. ఇది ఓమ్నివిజన్ సెన్సార్ అయి ఉండవచ్చని, ఇది ఈ హ్యాండ్‌సెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని తెలుస్తోంది. సెన్సార్ స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కానప్పటికీ, ఇది పరిమాణంలో పెద్దదిగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది.

Shocking : జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు.. కారణం ఇదే!

ఇది కాకుండా, హానర్ మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్ కూడా 200MP ప్రధాన కెమెరాను ఉపయోగించుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గత నెలలో విడుదలైన మ్యాజిక్ V5కి అప్డేటెడ్ గా వస్తుందని భావిస్తున్నారు. మ్యాజిక్ V5లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.