Vivo V60 Lite 4G: వివో సంస్థ త్వరలో విడుదల చేయనున్న వివో V60 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ మొబైల్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6.77 అంగుళాల AMOLED డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ తో రానుంది. ఇది 8GB ర్యామ్ ను కలిగి ఉంటుంది. వివో V60 లైట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. దీనికి 32MP ఫ్రంట్ కెమెరా, దుమ్ము, నీటి నిరోధకత కోసం IP65 రేటింగ్ కూడా ఉండవచ్చు.
Viral: మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన
లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ రంగులలో కనిపించింది. డిస్ప్లేలో పంచ్ హోల్ కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్, సన్నటి బెజెల్స్ ఉన్నాయి. అలాగే ఇది ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 తో రానుంది. ఇక దీని డిస్ప్లే పరంగా చూస్తే ఇన్ధడులో 6.77 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 94.2% స్క్రీన్-టు-బాడీ రేషియోలు ఉన్నాయి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ ఉండగా, 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ ఉండనున్నట్లు సమాచారం.
Astrology: సెప్టెంబర్ 19, శుక్రవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?
ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోనీ IMX882 సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. ఇక ఇందులో 6,500mAh బ్యాటరీతో పాటు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. అలాగే అదనపు ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు. ఇది IP65 రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7.59mm మందంతో ఉంటుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందో వివరాలు తెలియరాలేదు.