మళ్లీ ఉద్యోగానికి రావాలనుకుంటున్న మహిళా నిపుణుల కోసం ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ పేరిట ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ నియామకాలకు అర్హత సాధించాలంటే, మహిళా అభ్యర్థులకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం 6 నెలల పాటు విరామంలో ఉండాలని కంపెనీ రూల్ పెట్టింది. జావా, .నెట్, ఎస్ఏపీ, ఒరాకిల్, సేల్స్ఫోర్స్, పెగాసస్, రియాక్ట్, పైథాన్, యాంగ్యులర్, ఇన్ఫర్మేటికా, సెలానియం టెస్టింగ్లలో డెవలపర్, టెక్ లీడ్, మేనేజర్ స్థానాలకు మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తుంది.
పెళ్లయిన తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యలతో చాలా మంది మహిళలు జాబ్ కి బ్రేక్ వేస్తుంటారు. తర్వాత వారు ఒక్కసారిగా మళ్లీ జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్న జాబ్ దొరకక చాలా ఇబ్బందులు పడతారు. వారి కోసేమే ఇన్పోసిస్ మంచి ఆఫర్ ప్రకటించింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తమ ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2030కు మొత్తం ఉద్యోగుల్లో 45% మంది మహిళలు ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్లో దాదాపు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో మహిళల వాటా 39 శాతంగా ఉంది. విజయవంతమైన రిఫరల్స్ ఇచ్చిన తమ ఉద్యోగులకు రూ.50,000 వరకు ప్రోత్సాహకాలను సంస్థ అందిస్తోంది.
ఫిబ్రవరిలో మహిళలను తీసుకునేందుకు ‘రీఇగ్నైట్ 2025’ కార్యక్రమాన్ని టాటా టెక్నాలజీస్ ఏర్పాటు చేసింది. ‘రిటర్న్షిప్’ పేరుతో హెచ్సీఎల్ టెక్ ఓ పోగ్రాంను ప్రారంభించింది. యాక్సెంచర్ ఇండియా ‘కెరీర్ రీబూట్’, విప్రో‘బిగిన్ ఎగైన్’ కార్యక్రమాలు కూడా ఇదే కోవలోకి వస్తాయని ఐటీ నిపుణులు వెల్లడించారు.