Leading News Portal in Telugu

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition Launched.. Price, Features, Design Details are


  • రియల్‌మీ 15 ప్రో 5జీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ భారత్‌లో విడుదలైంది.
  • ఫోన్ డిజైన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌ ప్రేరణతో
  • రూపొందించబడింది.

    ప్యాకేజింగ్‌లో Iron Throne స్టాండ్, King’s Hand పిన్, Westeros మినీ మోడల్, స్టికర్లు వంటి ప్రత్యేక గిఫ్టులు

Realme 15 Pro 5G: రియల్‌మీ సంస్థ Realme 15 Pro 5G Game of Thrones Limited Edition స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఇప్పటికే విడుదలైన రియల్‌మీ 15 Pro 5G మోడల్‌ను ఆధారం చేసుకుని రూపొందించబడింది. అయితే ఇందులో ప్రఖ్యాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ సిరీస్ నుండి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన డిజైన్ అంశాలు, థీమ్‌లను పొందుపరిచారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్, సిరీస్ అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా తీర్చిదిద్దారు.

Game of Thrones అభిమానులను ఆకట్టుకునేలా దీని ప్యాకేజింగ్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్రత్యేక ప్యాక్‌లో ఫోన్‌తో పాటు Iron Throne ఫోన్ స్టాండ్, King’s Hand పిన్, Westeros మినీ మోడల్, అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టికర్లు, పోస్టుకార్డులు ఇంకా ఇతర యాక్సెసరీస్ కూడా లభిస్తాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999గా నిర్ణయించారు. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించినట్లయితే రూ.3,000 తగ్గింపుతో రూ.41,999కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక

Realme 15 Pro 5G Game of Thrones ఎడిషన్ బ్లాక్, గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. వెనుక భాగంలో కెమెరా ఐలాండ్ చుట్టూ 3D డ్రాగన్ క్లా బోర్డర్, నానో ఎంగ్రేవ్ చేసిన మోటిఫ్‌లు కనిపిస్తాయి. దీని దిగువ భాగంలో హౌస్ టార్గేరియన్ చిహ్నమైన “మూడు తలల డ్రాగన్” ముద్రించబడి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌కు మరో ప్రత్యేకత ఉంది. అదే కలర్ చేంజింగ్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది. సాధారణంగా నలుపు రంగులో ఉండే ఈ ప్యానెల్ 42°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటితో తాకినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది డిజైన్‌కు ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది.

ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో రెండు ప్రత్యేకమైన కస్టమ్ UI థీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. మొదటిది “Ice” UI థీమ్. ఇది చల్లటి బ్లూ షేడ్స్‌తో ఉంటుంది. రెండవది “Dragonfire” UI థీమ్. ఇది అగ్ని లాంటి ఎరుపు రంగులతో రూపొందించబడింది. వీటితో పాటు ప్రత్యేకమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాల్‌పేపర్లు, ఐకాన్లు కూడా ఈ ఎడిషన్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటాయి.

Asaduddin Owaisi: రాకేష్ కాకుండా, చీఫ్ జస్టిస్‌పై ‘‘అసద్’’ దాడికి పాల్పడుంటే..?

డిజైన్, థీమ్‌లు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ.. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ యొక్క అంతర్గత స్పెసిఫికేషన్లు సాధారణ రియల్‌మీ 15 ప్రో 5జీ మోడల్‌తో సమానంగా ఉన్నాయి. ఇందులో 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits బ్రైట్‌నెస్, Corning గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మెమరీ, స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 12GB LPDDR4x RAM, 512GB UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా సెటప్‌లో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, అలాగే 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ Realme UI 6.0 (Android 15 ఆధారంగా) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.