MacBook Air M4 Discount: ఆపిల్ మ్యాక్‌బుక్ కొనాలని ప్లాన్ చేసుకునే వారికి గుడ్ న్యూస్. మ్యాక్‌బుక్ ఎయిర్ M4 పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉందని మీలో ఎంత మందికి తెలుసు. ఆపిల్ మ్యాక్‌బుక్‌పై రూ.₹18 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా.. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్‌లో అందుబాటులో లేదు. ఈ ఆఫర్ విజయ్ సేల్స్‌లో ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M4 అనే బ్రాండ్ నుంచి వచ్చిన శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను ఈ సేల్స్ నుంచి భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
READ ALSO: Cough syrup: దగ్గుమందు మరణాలు.. తమిళనాడు సహకరించడం లేదన్న మధ్యప్రదేశ్ సీఎం..
ఇది మంచి ఎంపిక..
కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ఆఫర్లతో కలిపి ఈ పరికరంపై గణనీయంగా డబ్బు ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు. Apple MacBook Air M4 ఎంతకు వస్తుందో తెలుసా.. దీని ప్రారంభ ధర రూ.99,900 కు మొదలు అవుతుంది. ఈ ధర 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. విజయ్ సేల్స్ ఈ ల్యాప్‌టాప్‌పై రూ.8వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా లభించనున్నాయి. ఈ ల్యాప్‌టాప్ రూ.10 వేల బ్యాంక్ ఆఫర్‌తో రానుంది. ఈ ఆఫర్ ICICI బ్యాంక్, SBI కార్డులపై అందుబాటులో ఉంది. రెండు ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, కొనుగోలుదారులు మొత్తం రూ.18 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మొత్తం డిస్కౌంట్ల తర్వాత ఈ ల్యాప్‌టాప్ రూ.81,900కి అందుబాటులో ఉంటుంది.
MacBook Air M4 ప్రత్యేకతలు..
MacBook Air M4.. M4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది గతంలో వచ్చిన వెర్షన్‌తో పోలిస్తే చాలా మెరుగైన పనితీరును అందిస్తుంది. ల్యాప్‌టాప్ 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే, 10-కోర్ CPUని కలిగి ఉంది. దీనికి 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరాలో సెంటర్ స్టేజ్, డెస్క్ వ్యూ ఉన్నాయి. ఇవి వీడియో కాల్స్, కంటెంట్ క్రియేషన్‌కు సహాయపడతాయి. కంపెనీ నివేదికల ప్రకారం.. ఈ పరికరం 18 గంటల బ్యాటరీ లైఫ్‌తో అందుబాటులోకి రానుంది.
READ ALSO: Ancient Temple Turkey: ముస్లిం దేశంలో బయట పడిన దేవాలయం.. ఎన్నివేల సంవత్సరాల నాటిది అంటే!