Vivo TWS 5 Series Launched with Hi-Fi Audio, AI Noise Reduction and 48-Hour Battery Life.. Price, Features are
- ట్రూలీ వైర్లెస్ ఇయర్‌బడ్స్ Vivo TWS 5 సిరీస్ ను చైనాలో లాంచ్
- ఈ సిరీస్‌లో Vivo TWS 5, Vivo TWS 5 Hi-Fi అనే రెండు వేరియంట్లు
- ఇయర్‌బడ్స్‌లో 11mm డైనమిక్ డ్రైవర్స్, Hi-Res Audio సర్టిఫికేషన్
- AI ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ కోసం మూడు మైక్రోఫోన్లు.
Vivo TWS 5: వివో (Vivo) తాజాగా తన కొత్త ట్రూలీ వైర్లెస్ (TWS) స్టీరియో హెడ్సెట్ Vivo TWS 5 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌ను కంపెనీ తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు Vivo X300, Vivo X300 Proతో పాటు లాంచ్ చేసింది. గత సంవత్సరం వచ్చిన Vivo TWS 4 మోడల్ లాగే ఈ సిరీస్‌లో కూడా రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే Vivo TWS 5, Vivo TWS 5 Hi-Fi. ఈ రెండూ 11mm డైనమిక్ డ్రైవర్స్ తో వస్తాయి. అలాగే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇవి గరిష్టంగా 60dB వరకు బయటి శబ్దాన్ని తగ్గించగలవని కంపెనీ చెబుతోంది. చార్జింగ్ కేసుతో కలిపి ఈ ఇయర్‌బడ్స్ 48 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని పేర్కొంది.
10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్ప్లేతో Vivo Pad 5e లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ కొత్త Vivo TWS హెడ్సెట్లలో 11mm డ్రైవర్స్ ఉన్నాయి. వీటి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ 16Hz నుంచి 48kHz వరకు ఉంటుంది. Hi-Fi వేరియంట్లో LDAC, LHDC, AAC, SBC, LC3 కోడెక్‌లకు సపోర్ట్ ఉంటుంది. అయితే, సాధారణ TWS 5 మోడల్లో LDAC, AAC, SBC, LC3 ఆడియో కోడెక్లు అందుబాటులో ఉంటాయి. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా సగటుగా 28dB శబ్ద తగ్గింపు కల్పిస్తాయి. గేమింగ్ కోసం ఈ ఇయర్‌బడ్స్ 42ms లేటెన్సీ రేట్ సపోర్ట్ చేస్తాయి. ఇవి Hi-Res Audio సర్టిఫికేషన్ పొందాయి. అలాగే ఇవి DeepX 4.0 స్టీరియో సౌండ్ అందిస్తాయి. ఇక కనెక్టివిటీ విషయంలో బ్లూటూత్ 5.4 టెక్నాలజీని ఉపయోగించారు. దీని ఆపరేటింగ్ రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుంది. వీటికి IP54 సర్టిఫికేషన్ ఉంది. అంటే ఇవి దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ కల్పిస్తాయి.
ఈ సిరీస్‌లో 5,500Hz అల్ట్రా-వైడ్ బ్యాండ్ నాయిస్ రిడక్షన్, అలాగే AI ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ కోసం మూడు మైక్రోఫోన్లు ఉన్నాయి. రెండవ తరం సెరామిక్ టంగ్స్టన్ అకౌస్టిక్ డయాఫ్రాగమ్ తో పాటు నానో కోటింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. రెండు మోడల్‌లు కూడా మల్టీ-డివైస్ ట్రిపుల్ కనెక్షన్ సపోర్ట్‌తో వస్తాయి. ఇవి స్మార్ట్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా చైనీస్, ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, ఫ్రెంచ్, థాయ్, ఇతర భాషల్లో వాయిస్ అనువాదం చేసే సదుపాయం కలిగి ఉన్నాయి. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ అందుకోవడం, తిరస్కరించడం ఇంకా ప్లే లిస్టులు ఎంపిక చేయడం వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.
Three-Wife Wedding: ఉత్తమ భార్యలంటే మీరే తల్లి.. మొగుడికి దగ్గరుండి మూడో పెళ్లి
ఇక బ్యాటరీ పరంగా చూస్తే.. ANC ఆన్ చేసినప్పుడు ఇయర్‌బడ్స్ 6 గంటల ప్లేటైమ్, కేసుతో కలిపి 24 గంటల వరకు పనిచేస్తాయి. ANC ఆఫ్ చేసినప్పుడు ఒక్క ఇయర్బడ్నే ఉపయోగించినా 12 గంటల వరకు, కేసుతో కలిపి 48 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే Vivo TWS 5 CNY 399 (రూ.4,500), Vivo TWS 5 Hi-Fi మోడల్ ధర CNY 499 (రూ.5,500). TWS 5 సింపుల్ వైట్, ప్యూర్ బ్లాక్, స్మోకీ పర్పుల్ కలర్లలో లభిస్తుండగా, TWS 5 Hi-Fi వేరియంట్ డీప్ సీ బ్లూ, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.