Motorola Offers: మోటరోలా కంపెనీ ఈ దీపావళి ఉత్సవ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రస్తుతం జరుపుకుంటున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్లో లిస్ట్ చేయబడ్డాయి. ఈ సేల్‌లో Motorola Edge 60 Pro, Moto Razr 60, Moto G96 5G, Moto G86 Power లతోపాటు ఇతర కొన్ని హ్యాండ్సెట్ లపై వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదండోయ్.. ట్రూలీ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్, QLED TVs, Mini LED TVs పై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరి ఆ ఆఫర్స్ ఫుల్ లిస్ట్ చూసేద్దామా..
BC Reservations: సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం!
Motorola Edge 60 Pro 8GB RAM + 256GB స్టోరేజ్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.29,999. అయితే, దీపావళి సేల్‌లో ఇది అన్ని ఆఫర్లు కలిపి కేవలం రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే 12GB + 256GB రూ.28,999, 16GB + 512GB వేరియంట్‌లు రూ.32,999కు లభిస్తున్నాయి. అలాగే Motorola Edge 60 Fusion 8GB + 256GB రూ.18,999, 12GB + 256GB వేరియంట్ ల కోసం రూ.20,999 లేక్ లభించనున్నాయి.
Rani Mukerji: ప్రేక్షకుల అంగీకారం.. నాకు అవార్డు కంటే గొప్ప
Moto G96 5G వినియోగదారులు సాధారణ ధరల కంటే రూ.3,000 వరకు ఆదా చేసుకోవచ్చని మోటరోలా పేర్కొంది. దీపావళి సేల్‌లో 8GB + 128GB మోడల్ రూ.14,999కి, 8GB + 256GB మోడల్ రూ.16,999కి లభిస్తుంది. అలాగే Moto G86 Power 8GB + 128GB ను సేల్‌లో రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది లాంచ్ ధరతో పోలిస్తే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్‌లో Moto Razr 60పై భారీ డిస్కౌంట్ ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.49,999. కానీ, దీపావళి సేల్‌లో రూ.39,999కి లభిస్తుంది. అంటే రూ.10,000 భారీ తగ్గింపు లభిస్తుంది.