- హానర్ మ్యాజిక్ 8 సిరీస్ నేడు చైనాలో లాంచ్
- సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 8, మ్యాజిక్ 8 ప్రో మోడళ్లు
- ‘గోల్డెన్ క్లౌడ్స్ ఎట్ డాన్’, ‘అజ్యూర్ గ్లేజ్’ వేరియంట్లలో లభ్యం.
- 50MP + 50MP + 64MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, 50MP ఫ్రంట్ కెమెరా.
- 7,000mAh బ్యాటరీ, 90W వైర్డ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
Honor Magic 8 Series: స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటైన హానర్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైన హానర్ మ్యాజిక్ 8 సిరీస్‌ను ఈరోజు (అక్టోబర్ 15) చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 8, హానర్ మ్యాజిక్ 8 ప్రో మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందుగానే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన పలు టీజర్లను విడుదల చేసింది. టీజర్స్ ప్రకారం హానర్ మ్యాజిక్ 8 సిరీస్ ‘గోల్డెన్ క్లౌడ్స్ ఎట్ డాన్’, ‘అజ్యూర్ గ్లేజ్’ అనే ఆకర్షణీయమైన రెండు కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10పై పని చేయనున్నాయి.
Astrology: అక్టోబర్ 15, బుధవారం దిన ఫలాలు.. ఏ రాశి వారు ఏం చేయాలంటే..?
హానర్ మ్యాజిక్ 8 ఫోన్‌లో 6.58 అంగుళాల 1.5K LTPO ఫ్లాట్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4320Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇది Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ద్వారా నడుస్తూ, ఏకంగా 1TB స్టోరేజ్ అందించనుంది. కెమెరా విభాగంలో 50MP మెయిన్ లెన్స్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3X ఆప్టికల్ జూమ్) లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50MP రిజల్యూషన్‌తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 7,000mAh బ్యాటరీ, 90W వైర్డ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
మరోవైపు, హానర్ మ్యాజిక్ 8 ప్రో మోడల్‌లో 6.71 అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 16GB RAM, 1TB స్టోరేజ్ ఉండనుంది. కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 200MP టెలిఫోటో సెన్సార్ ఉండవచ్చని సమాచారం. ఫ్రంట్ కెమెరా కూడా 50MP రిజల్యూషన్‌తో అందించబడుతుంది. ప్రో వెర్షన్‌లో 7,200mAh బ్యాటరీ ఉండి, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.
Off The Record: ఆ జిల్లాపై పట్టు సాధించే దిశగా హోంమంత్రి అనిత..? ఇంఛార్జ్ మంత్రి దెబ్బకు జిల్లా మినిస్టర్ కాగిపోతున్నారా..?
ధర విషయానికి వస్తే.. అధికారిక ధర ఇంకా వెల్లడించలేదు. అయితే హానర్ మ్యాజిక్ 7 సిరీస్‌తో సమానంగా ఉండే అవకాశం ఉంది. హానర్ మ్యాజిక్ 7 ధర CNY 4,499 (రూ.53,100) నుంచి ప్రారంభమైంది. టాప్ వెర్షన్ CNY 5,499 (రూ.64,900) వరకు ఉండగా, హానర్ మ్యాజిక్ 7 ప్రో ధర CNY 5,699 (రూ.67,300) నుంచి ప్రారంభమై CNY 6,699 (రూ.79,100) వరకు ఉంది. కొత్త మ్యాజిక్ 8 సిరీస్ కూడా మొదట చైనాలో మాత్రమే లభ్యమై, తరువాత గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుందని అంచనా.