Leading News Portal in Telugu

ఇండియన్ వెర్షన్ కంటే బెస్ట్ అప్‌గ్రేడ్ ఫీచర్లతో అక్కడ iQOO Z10R 5G లాంచ్..!


iQOO Z10R 5G: వివో సబ్ బ్రాండ్ అయిన iQOO తాజాగా తన iQOO Z10R 5G స్మార్ట్‌ఫోన్‌ను రష్యాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ ఇప్పటికే భారత మార్కెట్‌లో విడుదలైన iQOO Z10R 5Gతో పోలిస్తే డిజైన్, చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యం, స్టోరేజ్ వేరియంట్ల పరంగా కొంత భిన్నంగా ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15పై నడుస్తాయి. వీటిలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

రష్యాలో iQOO Z10R 5G ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ RUB 22,999 (రూ.26,000) నుండి ప్రారంభమవుతుంది. ఇక 12GB + 512GB మోడల్ ధర RUB 27,999 (రూ.31,000)గా నిర్ణయించారు. ఈ ఫోన్ అక్టోబర్ 6న లాంచ్ కాగా.. ప్రస్తుతం డీప్ బ్లాక్, టైటానియం షైన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రష్యాలో యాండెక్స్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో కూడా ఇది కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్‌లో iQOO Z10R 5G జూలై 24న లాంచ్ అయింది. ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.19,499 కాగా, 8GB + 256GB వేరియంట్ రూ.21,499 , 12GB + 256GB వేరియంట్ రూ.23,499 ఉంది. భారతీయ వినియోగదారులకు ఇది ఆక్వా మెరైన్, మూన్ స్టోన్ కలర్లలో అందుబాటులో ఉంది.

స్టైల్ అండ్ పవర్ కాంబో.. సరికొత్త డిజైన్, అప్‌గ్రేడ్‌డ్ ఫీచర్లతో నేడు లాంచ్ కానున్న Honor Magic 8 Series..!

రష్యా వెర్షన్‌లో ఉన్న iQOO Z10R 5Gలో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే (1080×2392 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. భారత మోడల్‌లో ఇదే డిస్‌ప్లే ఉన్నప్పటికీ, దాని పీక్ బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ వరకు చేరుతుంది. రష్యా వెర్షన్‌ను 4nm MediaTek Dimensity 7360-Turbo చిప్‌సెట్ ఉండగా, భారత మోడల్ Dimensity 7400 SoCతో వస్తుంది. రష్యా వెర్షన్‌లో గరిష్టంగా 12GB LPDDR4X ర్యామ్ 512GB UFS 3.1 స్టోరేజ్ లభిస్తుంది.

కెమెరా విషయంలో రెండు ఫోన్లలోనూ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. అయితే రష్యా వెర్షన్‌లో 8MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉండగా, భారత మోడల్‌లో 2MP బోకె సెన్సార్ మాత్రమే ఉంది. ఫ్రంట్‌లో రెండు మోడళ్లలోనూ 32MP సెల్ఫీ కెమెరా సమానంగా ఉంది. రష్యా వెర్షన్ IP65 రేటింగ్ కలిగి ఉండగా, భారత మోడల్ IP68, IP69 రేటింగ్స్‌తో మరింత మెరుగైన డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ అందిస్తుంది. రష్యా వెర్షన్‌లో 6,500mAh బ్యాటరీ ఉండి, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. భారత వెర్షన్ మాత్రం 44W ఛార్జింగ్ ను మాత్రమే అందిస్తుంది. కొత్త మోడల్ 163.76×28×7.59mm కొలతలతో ఉండి, సుమారు 194 గ్రాములు బరువు ఉంటుంది.

Off The Record: ఆ జిల్లాపై పట్టు సాధించే దిశగా హోంమంత్రి అనిత..? ఇంఛార్జ్‌ మంత్రి దెబ్బకు జిల్లా మినిస్టర్‌ కాగిపోతున్నారా..?