Leading News Portal in Telugu

Diwali 2025 Offers: iPhone 15 vs iPhone 13 Price on Amazon


  • 2025 దీపావళి బిగ్ ఆఫర్
  • ఒకే ధరకు ఐఫోన్ 15, ఐఫోన్ 13
  • ఐఫోన్ 15ని కొనుగోలు చేయడం బెస్ట్

యాపిల్ ‘ఐఫోన్’కు అంత డబ్బు పెట్టడం ఎందుకని చాలామంది ఆలోచించడం సర్వసాధారణం. అందుకే సామాన్య జనాలు పాత మోడళ్ల వైపు మొగ్గు చూపుతారు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు ఎదురుచూస్తుంటారు. అందులోనూ పాత, కొత్త మోడళ్లు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉంటే?.. వెంటనే కొనేస్తారు. ప్రస్తుతం అలాంటి ఆఫర్ ఒకటి అమెజాన్‌లో ఉంది. యాపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 15 ధరలు అమెజాన్‌లో దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇది కొంచెం ఆశ్చర్యకరమైనదే కానీ.. వినియోగదారులకు మాత్రం మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 15 కొత్తది, మంచి మోడల్ అయినప్పటికీ.. ఐఫోన్ 13 ధరతో పోల్చితే పెద్దగా తేడా లేదు.

అమెజాన్‌లో ప్రస్తుతం దీపావళి 2025 సేల్ నడుస్తోంది. ఐఫోన్ 13 కంటే కొంచెం ఎక్కువ డబ్బు పెడితే.. కొనుగోలుదారులు ఐఫోన్ 15ని పొందవచ్చు. ఐఫోన్ 13 వచ్చి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆఫర్‌లో ఐఫోన్ 15ని కొనుగోలు చేయడం మంచి ఎంపిక. అమెజాన్‌లో ఐఫోన్ 13 ఫోన్ 128 జీబీ వేరియంట్ ధర రూ.43,900గా ఉంది. ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ ధర రూ.47,999కు అందుబాటులో ఉంది. అంటే రెండింటి మధ్య ధర వ్యత్యాసం రూ.4,099 మాత్రమే. అందుకే ఐఫోన్ 15ని కొనుగోలు చేయడం బెస్ట్.

ఐఫోన్ 15లో A16 బయోనిక్ చిప్ ఉంది. ఇది ఐఫోన్ 13లో ఉండే A15 కంటే వేగంగా, సమర్థవంతంగా ఉంటుంది. యాప్‌లు, మల్టీ టాస్కింగ్‌ను సులభంగా నిర్వహిస్తుంది. పనితీరు సున్నితంగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఐఫోన్ 15 ఫోన్ 6.1-అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 48 ఎంపీ ప్రధాన లెన్స్‌ను కలిగి ఉంటుంది. 2x జూమ్‌ను కూడా అందిస్తుంది. ఫోటోలు అద్భుతంగా వస్తాయి. ఈ పండుగ సీజన్‌లో ఐఫోన్ 15 కొనడం మరింత మంచి ఎంపిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.