Leading News Portal in Telugu

HONOR Magic8 Series Launch in China with 200MP Camera, 7200mAh Battery and AI Features


HONOR Magic8 Series: హానర్ తాజాగా చైనాలో HONOR Magic8 Series స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా HONOR Magic8, Magic8 Pro స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా పరిచయం చేసింది. ఈ సిరీస్ అత్యాధునిక టెక్నాలజీతో, అధిక పనితీరు, మంచి కెమెరా సిస్టమ్, AI ఆధారిత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. మరి ఈ కొత్త స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

ఎన్నో స్మార్ట్ ఫోన్స్ చూశాం కానీ.. రాబోయే HONOR Robot Phone వేరే లెవెల్ అంతే.! వీడియో వైరల్..

Magic8 Pro లో 6.71 అంగుళాల 1.5K OLED క్వాడ్ కర్వ్ LTPO స్క్రీన్ ఉంది. అయితే హానర్ Magic8 మోడల్ 6.58 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేను మాత్రమే అందిస్తుంది. ఈ స్క్రీన్లు 1 నుంచి 120Hz రిఫ్రెష్ రేట్, గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ 1800 నిట్స్, లోకల్ పీక్ బ్రైట్నెస్ 6000 నిట్స్, 4320Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, సర్క్యులర్‌లీ పోలరైజ్డ్ లైట్ ఐ ప్రొటెక్షన్, హానర్ రైనో Glass కవరింగ్ సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు ఫోన్లకు Snapdragon 8 Elite Gen 5 SoC, 12GB/16GB ర్యామ్, 256GB/512GB/1TB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్స్ కలిగి ఉన్నాయి. హానర్ ప్రకారం ఈ ఫోన్లు 4.28 మిలియన్ల Antutu 11 బెంచ్ మార్క్ స్కోర్ పొందాయి. Magic UI 10 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆండ్రాయిడ్, హార్మొనీ OS, iOS, విండోస్ మధ్య ఫైల్ షేరింగ్, టాస్క్ సింక్, క్రాస్ డివైస్ ఫంక్షనాలిటీలు సులభంగా చేయవచ్చు.

ఇక ఈ మొబైల్స్ లో హానర్ AI ఏజెంట్, YOYO ఏజెంట్ వంటి ఫీచర్లు.. అలాగే 3,000 కంటే ఎక్కువ సార్లు ఆటోమేటిక్ ఫంక్షన్స్ నడపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనితో వినియోగదారులు AI బటన్ ఉపయోగించి ఒక క్లిక్‌లో ఆహారంలోని పోషక విలువలను కూడా గుర్తించవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే.. Magic8 Pro లో 200MP అల్ట్రా నైట్ టెలిఫోటో కెమెరా, 1/1.4 అంగుళాల సెన్సర్, f/2.6 అపర్చర్, AI అడాప్టివ్ స్టెబిలైజషన్ మోడల్ ద్వారా అత్యంత స్థిరమైన CIPA 5.5 స్థాయి అందిస్తుంది. Magic8 సిరీస్ కొత్త మ్యాజిక్ కలర్ AI పవర్డ్ కలర్ ఇంజిన్ ను కూడా పరిచయం చేసింది. ఇది 16.77 మిలియన్ల రంగులను స్మార్ట్‌గా గుర్తించి ప్రాసెస్ చేస్తుంది.ఇది రెయిర్ కెమెరా 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 50MP ఫ్రంట్ కెమెరా తో వస్తుంది.

డ్యూయల్ టోన్ ఫినిషింగ్, టచ్ కంట్రోల్‌లతో Honor Earbuds 4 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!

ఇక ఈ ఫోన్లు IP68 + IP69 + IP69K రేటింగ్లతో ధూళి, నీరు రోధకత కలిగి ఉన్నాయి. Magic8 Pro లో 7200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్, 80W వైర్‌లెస్ చార్జింగ్ మద్దతు ఉంది. అలాగే Magic8 లో 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్, 80W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ హానర్ Magic8 సిరీస్ సన్ రైజ్ గోల్డ్, స్కై సియన్, బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక ధరల విషయానికి వస్తే.. 12GB+256GB మోడల్ కోసం 4499 యాన్స్ (రూ.55,440) నుండి ప్రారంభమవుతాయి. Magic8 Pro 12GB+256GB మోడల్ 5699 యాన్స్ (రూ.70,220) నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లు చైనాలో అక్టోబర్ 23 నుండి అమ్మకాలు జరుగుతాయి. అలాగే ఈ ఏడాది పూరి అయ్యే లోపు అంతర్జాతీయంగా లాంచ్ చేయనున్నారు.