Honor MagicPad 3 Series: హానర్ (Honor) కంపెనీ తాజాగా హానర్ మ్యాజిక్ ప్యాడ్ 3 ప్రో , మ్యాజిక్ ప్యాడ్ 3 (12.5) మోడళ్లను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు టాబ్లెట్లు మంచి డిజైన్‌తో పాటు భారీ స్పెసిఫికేషన్లతో వచ్చాయి. మ్యాజిక్ ప్యాడ్ 3 ప్రో 13.3 అంగుళాల 3.2K LCD డిస్ప్లేతో వస్తుండగా.. దీని రిఫ్రెష్ రేట్ 165Hz. ఇది Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే ఇందులో 12,450mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి అలాగే ఇది YOYO AI ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇక కెమెరా పరంగా, హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో వెనుక భాగంలో 13MP ప్రధాన సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉండగా.. ముందు భాగంలో 9MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. అలాగే ఇందులో ఎనిమిది స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు కలిగి ఉంటుంది. ఇది Wi-Fi 7, బ్లూటూత్ 6.0, USB టైపు-C 3.2 Gen 2 సపోర్ట్‌లతో వస్తుంది. టాబ్లెట్ మందం 5.79mm కాగా, బరువు 595 గ్రాములు. ఇది ఫ్లోటింగ్ గోల్డ్, మూన్ షాడో వైట్, స్టార్రి స్కై గ్రే రంగుల్లో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో (13.3) ధర CNY 3,999 (రూ.49,400) నుంచి ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్లో ఇది CNY 3,799 (రూ.47,000) కు లభిస్తుంది. 12GB+512GB వేరియంట్ CNY 4,399 (రూ.54,400), 16GB+512GB వెర్షన్ CNY 4,699 (రూ.58,100) గా నిర్ణయించబడ్డాయి.
Lawyer Misbehaves Women: ఎందయ్యా ఇది.. నువ్వు న్యాయవాదివా.. కామ వాదివా..
ఇక హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 (12.5) మోడల్లో 12.5 అంగుళాల 3K LCD స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 165Hz కాగా, బ్రైట్ నెస్ 1,000 నిట్స్ గా ఉంది. ఇది Snapdragon 8 Gen 3 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 12GB RAM + 256GB స్టోరేజ్ వరకు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ MagicOS 9 (Android 15 ఆధారంగా) పై నడుస్తుంది. అయితే త్వరలో MagicOS 10 (Android 16) అప్డేట్ రానుంది. ఇక ఫోటోగ్రఫీ కోసం, మ్యాజిక్ ప్యాడ్ 3 (12.5) వెనుక 13MP కెమెరా, ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఇది కూడా ఎనిమిది స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు కలిగిన సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 10,100mAh బ్యాటరీ ఉండగా, 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ధర విషయానికి వస్తే.. 8GB+256GB వేరియంట్ CNY 2,699 (రూ.33,400) వద్ద లభిస్తుండగా, 12GB+256GB వేరియంట్, స్పాఫ్ట్ లైట్ వెర్షన్ 8GB+256GB మోడళ్లు CNY 2,999 (రూ.37,300) వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇది గుడ్ లక్ పర్పుల్, మూన్ షాడో వైట్, రిలీజ్ ది పైన్ ట్రీస్, స్టార్రి నైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. హానర్ ఈ రెండు టాబ్లెట్లను స్మార్ట్ టచ్ కీబోర్డ్, హానర్ మ్యాజిక్ పెన్సిల్ 3 స్టైలస్ తో బండిల్ చేస్తోంది. ఇవి iOS, ఆండ్రాయిడ్ , హార్మొనీ OS ఎకోసిస్టమ్స్ మధ్య డేటా షేరింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉన్నాయి.
Fake Liquor Case: నకిలీ మద్యం కేసు.. వైరల్‌గా మారిన వాట్సాప్ ఛాటింగ్..