Leading News Portal in Telugu

Oppo Find X9 Pro, Oppo Find X9 Launched in China with flagship features like Dimensity 9500 Chip, 200MP Camera and IP69 Rating


OPPO Find X9 Pro, Find X9: ఒప్పో (Oppo) సంస్థ చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Find X9 Pro, Find X9 మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌లతో పనిచేస్తూ, Android 16 ఆధారంగా ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లంచ్ అయ్యాయి. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా సిస్టమ్ ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు ఫోన్లలోనూ 50MP Sony LYT 828 ప్రైమరీ సెన్సార్ ఉపయోగించారు. ప్రో మోడల్‌లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండగా, సాధారణ మోడల్‌లో 50MP టెలిఫోటో లెన్స్‌ను అందించారు. అలాగే ఈ సిరీస్ IP66, IP68, IP69 రేటింగ్స్‌ను కలిగి ఉండడంతో దుమ్ము, నీటి నిరోధకతలో అత్యుత్తమ రక్షణను అందిస్తుంది.

77th IPS Batch: 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్యఅతిథిగా బీఎస్ఎఫ్ డైరెక్టర్!

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. Oppo Find X9 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO డిస్‌ప్లే ఉండగా, Find X9లో 6.59 అంగుళాల 1.5K డిస్‌ప్లే వచ్చింది. ఈ రెండు డిస్‌ప్లేలు కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తాయి. HDR Vivid, Dolby Vision, HDR10+ సపోర్ట్‌తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే (AOD) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా రెండు మొబైల్స్ లోను Dimensity 9500 చిప్‌సెట్, గరిష్టంగా 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ వేరియంట్లు లభిస్తాయి. అలాగే కొత్త ColorOS 16లో అనేక AI ఆధారిత ఫోటో, ప్రొడక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Find X9లో 50MP సోనీ LYT-828 ప్రైమరీ సెన్సార్, 50MP సోనీ LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP Samsung JN5 అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక Find X9 Pro మొబైల్ లో కూడా అదే ప్రైమరీ, అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నప్పటికీ.. ఇది 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x డిజిటల్ జూమ్‌తో)ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా విషయంలో ఇందులో 50MP సెన్సార్‌తో వస్తుంది.

Australia: వన్డే ప్రపంచకప్‌లో ఎదురేలేదు.. అప్పుడే సెమీస్‌కి వచ్చేసారుగా!

Find X9 Proలో 7,500mAh బ్యాటరీ, Find X9లో 7,025mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB టైపు-C పోర్టులు ఉన్నాయి. Oppo Find X9 ధరలు చైనాలో CNY 4,399 (రూ.54,300) నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా Oppo Find X9 Pro ధరలు CNY 5,299 (రూ.65,400) నుంచి మొదలవుతాయి.