OPPO Pad 5: చైనాలో జరిగిన ఒప్పో లాంచ్ ఈవెంట్‌లో Oppo Pad 5 ను ట్యాబ్లెట్ ను అధికారికంగా లాంచ్ చేశారు. గత కొద్దిరోజులుగా వస్తున్న లీక్‌లు, రూమర్లకు తెరదించుతూ ఈ కొత్త ట్యాబ్ ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల అయ్యింది. ఇందులో 12.1 అంగుళాల 3K (3000×2120 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ HBM బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉన్నాయి. TÜV Rheinland సర్టిఫికేషన్ కూడా పొందింది. కాబట్టి ఇది చాలా రోజులు ఉపయోగించినా కంటికి అలసట తక్కువగా ఉంటుంది.
Preeti Reddy: మేడం సార్.. మేడం అంతే.. డాన్స్ తో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.!
Oppo Pad 5 ట్యాబ్లెట్ Oppo Pencil 2, Pencil 2 Pro స్టైలస్ లతో పూర్తిగా కంపాటబుల్‌గా ఉంటుంది. ఇది రియల్ టైమ్ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫికేషన్, సూపర్ స్మార్ట్ రీడింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ ఫీచర్ “రాత సమస్యకు ముగింపు పలికే టెక్నాలజీ”గా నిలుస్తుందని తెలిపింది. ఇదే కాకుండా ‘సాఫ్ట్ లైట్ ఎడిషన్’ అనే ప్రత్యేక వెర్షన్‌లో పేపర్‌లా కనిపించే మ్యాట్ స్క్రీన్‌ను అందించారు. ఇది కంటి సంరక్షణ కోసం ప్రత్యేక ఫీచర్ ను రూపొందించబడింది.
ఇక ఈ ట్యాబ్లెట్‌లో MediaTek Dimensity 9400+ 3nm SoCను ఉపయోగించారు. ఇది గత మోడల్‌లోని Dimensity 8350 కంటే అప్‌గ్రేడ్ వర్షన్. ఇందులో గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు లభిస్తాయి. 5.99mm అల్ట్రా స్లిమ్ మెటల్ బాడీ డిజైన్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇక బ్యాటరీ పరంగా చూస్తే Oppo Pad 5లో 10,165mAh బ్యాటరీ ఉంది. ఇది 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C (USB 3.2 Gen 1), 5G షేరింగ్, NFC ఉన్నాయి. ఇక కెమెరా విభాగంలో వెనుకవైపు 8MP రియర్ కెమెరా (LED ఫ్లాష్‌తో), ముందు 8MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ఆడియో విషయంలో కూడా Hi-Res సర్టిఫికేషన్ కలిగిన USB టైపు-C ఆడియో సపోర్ట్ ఉంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఒక్కరోజులోనే రూ.3330 పెరిగింది!
Oppo Pad 5 ట్యాబ్లెట్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.32,090 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ.34,560. అదే 8GB + 256GB Soft Light వెర్షన్ ధర సుమారు రూ.38,260 కాగా, 12GB + 256GB వేరియంట్ కూడా రూ.38,260 కు లభిస్తుంది. అలాగే టాప్ వేరియంట్స్12GB + 256GB Soft Light వెర్షన్ ధర సుమారు రూ.41,965. అత్యధిక వేరియంట్ 16GB + 512GB సుమారు రూ.44,435 గా ఉండనున్నాయి. Oppo Pad 5 కోసం ప్రత్యేక యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. Smart Touch కీబోర్డ్ ధర సుమారు రూ.8,630, Oppo Pencil 2 Pro ధర రూ.6,160, Smart ప్రొటెక్టివ్ కేస్ ధర రూ.2,455 గా ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ లక్కీ పర్పుల్, గాలక్సీ సిల్వర్, స్పేస్ గ్రే కలర్లలో లభిస్తుంది. చైనాలో అక్టోబర్ 22 నుండి ఈ ట్యాబ్లెట్ విక్రయాలు జరగనున్నాయి.