Leading News Portal in Telugu

Lava says ProBuds Aria 911 can be purchased for just Rs 21


  • లావా దీపావళి ఆఫర్
  • కేవలం రూ. 21 కే ఇయర్‌బడ్స్

దీపావళి వస్తుందంటే చాలు ఉద్యోగులకు బోనస్ లు, కంపెనీల ఆఫర్లకు సంబంధించిన విషయాలు హల్ చల్ చేస్తుంటాయి. దీపావళిని పురస్కరించుకుని తమ సేల్ ను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. తాజాగా దేశీయ కంపెనీ లావా ప్రజల కోసం దీపావళి ముహూర్త సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో, ఇయర్‌బడ్‌లను కేవలం రూ.21కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లు ‘ప్రోబడ్స్’ బ్రాండ్‌కు చెందినవి. వీటిని కంపెనీ సాధారణ రోజుల్లో చాలా ఎక్కువ ధర(రూ.999)కు విక్రయిస్తుంది. ఈ సేల్‌లో ప్రోబడ్స్ ఆరియా 911ని రూ.21కే కొనుగోలు చేయవచ్చని లావా తెలిపింది. ఇవి సింగిల్ ఛార్జ్‌పై మొత్తం 35 గంటల పాటు పనిచేస్తాయి. 10 నిమిషాలు ఛార్జ్ చేసిన తర్వాత 150 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ ఇయర్ బడ్స్ ను సొంతం చేసుకునేందుకు కంపెనీ కొన్ని షరతులను పెట్టింది.

ప్రోబడ్స్ ఆరియా 911 బుకింగ్ కోసం అక్టోబర్ 21న మధ్యాహ్నం 1:15 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లావా eStoreలో జరుగుతుంది. 100 మంది వినియోగదారులు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందే వీలుంటుంది. ప్రోబడ్స్ ఆరియా 911 డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ కేస్‌తో ఒకసారి ఛార్జ్ చేస్తే 35 గంటల వరకు ఉపయోగించవచ్చని పేర్కొంది. ప్రోబడ్స్ ఆరియా 911 నాయిస్ క్యాన్సిలేషన్‌ను కూడా కలిగి ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతు ఇస్తుంది. అవి స్పష్టమైన కాల్‌ల కోసం ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)ని కూడా కలిగి ఉన్నాయి. IPX4 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటాయి. వీటికి టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ సౌకర్యం కూడా ఉన్నాయి. ఇవి బ్లూటూత్ v5.3 కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. టైప్-సి ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరకు ఇయర్ బడ్స్ కావాలనుకును వారు ఈ సేల్ ను మిస్ చేసుకోకండి.