MOTOROLA Edge 60 Fusion 5G: మోటోరోలా అభిమానులకు శుభవార్త.. హై డిమాండ్ ఉన్న MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. దీపావళి పండుగ ఆఫర్లలో భాగంగా ఈ మొబైల్‌ను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 25,999 వరకు ఉండగా, ప్రస్తుతం ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత సుమారు రూ. 19,999 ధరకే అందుబాటులో ఉంది. అంటే ఏకంగా 23% డిస్కౌంట్ లభించినట్లే.. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించడం ద్వారా ఈ ధరను మరింతగా తగ్గించుకోవచ్చు. దాంతో ఈ అద్భుతమైన 5G మొబైల్ దాదాపు రూ. 17,670కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.
Tollywood Diwali : నాలుగు సినిమాలలో సౌండ్ చేసిన బాంబు.. తుస్సుమనిపించిన సినిమాలు ఏవంటే?
MOTOROLA Edge 60 Fusion 5G ముఖ్యమైన స్పెసిఫికేషన్ల వివరాల విషయానికి వస్తే.. ఇందులో డిస్ప్లే 6.67-అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో కూడిన pOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ మొబైల్ కు వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో), 13MP అల్ట్రా-వైడ్/మాక్రో సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఏకంగా 21% తగ్గింపు.. 6400mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా ఉన్న IQOO Neo 10R 5G పై భారీ ఆఫర్..!
MOTOROLA Edge 60 Fusion 5G మొబైల్ లో 5500 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 68W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఈ మొబైల్ 8GB లేదా 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది (మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు). ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI, IP68 +IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI ఫీచర్లు (motoAI, జెమినీ ద్వారా) వంటి అదనపు ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది.