Leading News Portal in Telugu

iPhone 17 Pro Diwali Sale: Massive Discount on iPhone 17 Pro at Vijay Sales


  • 2025 దీపావళి సేల్
  • ఐఫోన్ 17 ప్రోపై బంపర్ డిస్కౌంట్‌
  • బ్యాంక్ ఆఫర్‌లు, ట్రేడ్-ఇన్ డీల్‌ కూడా

‘ఐఫోన్’ 17 ప్రోపై బంపర్ ఆఫర్ ఉంది. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని.. తక్కువ ధరకు ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్.. ప్రస్తుతం వేల రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ చాలా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కాకుండా ‘విజయ్ సేల్స్’లో డిస్కౌంట్‌తో ఐఫోన్ 17 ప్రోను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 17 ప్రో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ జయ్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ.134,900కు అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్‌లు, ట్రేడ్-ఇన్ డీల్‌లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎస్బీఐ కార్డుతో రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా 5 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లతో ఫోన్ ధర రూ.1,29,900కు తగ్గుతుంది.

ఐఫోన్ 17 ప్రో మూడు కలర్ ఆప్షన్లలో, మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 17 ప్రోను సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 256 జీబీ, 512 జీబీ సహా 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో 6.3-అంగుళాల ఓఎల్‌ఈడీ సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. iOS 26, A19 ప్రో ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 48MP ప్రధాన లెన్స్‌తో కూడిన ఫ్యూజన్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లోని మిగతా రెండు లెన్స్‌లు కూడా 48MPగా ఉంటాయి. 18MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్షన్ బటన్, ఆపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నాయి.