Wobble Smartphones: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కొత్త ప్లేయర్ రాబోతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది స్వదేశీ ప్లేయర్. ఈ కొత్త ప్లేయర్ మార్కెట్లోకి సరికొత్తగా రావడంతో పాటు, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన సరసమైన స్మార్ట్ ఫోన్లను తీసుకువస్తుంది. ఇప్పటికే చాలా మంది స్మార్ట్ టీవీ మార్కెట్లో Wobble గురించి విని ఉంటారు. కానీ ఇది త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి కూడా రానుంది.
READ ALSO: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవం.. 98 అంగుళాల Xiaomi TV S Pro Mini LED లాంచ్.. ధర ఎంతంటే.?
వోబుల్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్
ఇండ్కల్కు సొంతం అయిన బ్రాండ్ వోబుల్. ఇండ్కల్ కంపెనీ ఇటీవలే ఈ బ్రాండ్‌ను స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇండ్కల్ సీఈఓ ఆనంద్ దూబే మాట్లాడుతూ… వోబుల్ ఫోన్లు భారతీయ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ బ్రాండ్ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చరిత్ర సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత మార్కెట్ చాలా పెద్దదని అన్నారు. ఇక్కడ ప్రతి వినియోగదారునికి వేర్వేరు డిమాండ్లు ఉంటాయని, ఒకే బ్రాండ్‌తో వినియోగదారులు అందరిని లక్ష్యంగా చేసుకోవడం కష్టం అని చెప్పారు. అందుకని వాళ్లు యువతను లక్ష్యంగా చేసుకుని వోబుల్ను ప్రారంభించినట్లు చెప్పారు. వోబుల్ స్మార్ట్‌ఫోన్ విస్తృత శ్రేణి సాంకేతికత, స్పెక్స్, మొదలైన ఫీచర్లను వినియోగదారులను అందిస్తుందని చెప్పారు. అలాగే కెమెరా నుంచి చిప్సెట్ వరకు, వినియోగదారులు వ్యాల్యూ ప్యాకేజీని అందుకుంటారని వెల్లడించారు.
మార్కెట్లోకి Wobble ఎన్ని ఫోన్లు తెస్తుంది..
Wobble కంపెనీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మూడు నుంచి నాలుగు ఫోన్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. అయితే ఈ ఫోన్లు ఒకేసారి లాంచ్ చేయడం లేదు. దానికి బదులుగా ఈ కంపెనీ ఏడాది పొడవునా వీటిని వినియోగదారులకు పరిచయం చేయనుంది. కాలం మారేకొద్ది కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలా కంపెనీ ప్లాన్ చేస్తుందని కంపెనీ సీఈఓ ఆనంద్ దూబే వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “కంపెనీ దృష్టి కేవలం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఉండదు. ఈ-కామర్స్ ఏ బ్రాండ్నైనా త్వరగా చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఒక కంపెనీగా, మేము మా స్మార్ట్ఫోన్లను ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తాము. వోబుల్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులు మొదటి రోజు నుంచే అత్యుత్తమ అమ్మకాల తర్వాత సేవను పొందుతారు” అని ఆయన వివరించారు.
Wobble ప్రత్యేకతలు..
Wobble కంపెనీ నుంచి రానున్న స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు.. మంచి కెమెరాతో కూడిన అధిక పనితీరు గల ఫోన్ కావాలంటే, మీరు భారీ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లోకి వోబుల్ ప్రవేశిస్తోందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. దీని అర్థం వోబుల్ ఫోన్లు అద్భుతమైన కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్లను కలిగి ఉంటాయని, అయితే ప్రస్తుతం స్పెసిఫికేషన్లను వెల్లడించలేమని సీఈఓ ఆనంద్ వివరించారు. ధరల విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరకు ప్రీమియం ఫీచర్లను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఫోన్ బ్లోట్‌వేర్ రహితంగా ఉంటుందని, ఇది స్టాక్ ఆండ్రాయిడ్‌తో వస్తుందని, అలాగే కంపెనీ మూడేళ్ల పాటు నవీకరణలను అందిస్తుందని చెప్పారు.
READ ALSO: Redmi Projector 4 Pro: రెడ్మి నుంచి కొత్త ప్రొజెక్టర్ లాంచ్.. ఇక టీవీతో పని లేదు!