Xiaomi TV S Pro Mini LED: షియోమీ (Xiaomi) సంస్థ తాజాగా ఐరోపా మార్కెట్‌లో Xiaomi TV S Pro Mini LED సిరీస్ 2026 నుండి 55, 65, 75 అంగుళాల మోడళ్లను పరిచయం చేసింది. 85 అంగుళాల మోడల్ విడుదల తరువాత, ఇప్పుడు చైనాలో ఏకంగా 98 అంగుళాల మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడింది. ఈ టీవీ సిరీస్‌కు Xiaomi Visual Engine Pro ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది ఎక్కువ వెలుగులో ఉన్న కూడా స్పష్టతను, నాణ్యతను కాపాడుకోవడానికి తక్కువ రిఫ్లెక్షన్ సాంకేతికత (low-reflection technology)ను కలిగి ఉంది. డార్క్ సీన్స్‌ను మెరుగుపరచడానికి గ్లోబల్ డిమ్మింగ్, అలాగే స్పోర్ట్స్ ఇంకా యాక్షన్ సన్నివేశాల్లో సున్నితమైన ప్లేబ్యాక్ కోసం మోషన్ క్లారిటీ ఇంజిన్‌లను ఈ టీవీలు ఉపయోగిస్తాయి.
Gudivada Amarnath: జగన్ వాస్తవాలు చెప్తుంటే మంత్రులు తట్టుకోలేకపోతున్నారు..!
గేమింగ్ కోసం ఈ టీవీలు 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతిస్తాయి. దీనిని 288Hz వరకు పెంచవచ్చు. ఇది అన్ని రకాల గేమ్‌లలో అత్యంత వేగవంతమైన ప్రతిస్పందనను అందిస్తుంది. 98 అంగుళాల మోడల్‌లో 880 Mini LED జోన్లు, 1300 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్నెస్ ఉన్నాయి. ఇది 4K 144Hz, 288Hz అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్‌కు మద్దతిస్తుంది. అంతేకాకుండా, కంటి రక్షణ కోసం Xiaomi Qingshan eye protection టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు.
Redmi Projector 4 Pro: రెడ్‌మి నుంచి కొత్త ప్రొజెక్టర్ లాంచ్.. ఇక టీవీతో పని లేదు!
98 అంగుళాల QD Mini LED మోడల్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..
డిస్‌ప్లే: 98″ QD Mini LED, 4K UHD (3840×2160) రిజల్యూషన్, 178° వీక్షణ కోణం.
క్వాలిటీ: 144Hz రిఫ్రెష్ రేట్, MEMC 4K 120Hz, DCI-P3 94%, HDR10+, HLG, డాల్బీ విజన్, ఫిలిం మేకర్ మోడ్.
బ్రైట్‌నెస్: 5700 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం (పీక్ బ్రైట్‌నెస్).
ఆడియో: 7 యూనిట్ స్పీకర్లు (2×15W+25W+2×8W). వీటిలో 2 ఫుల్-రేంజ్ + హై-ఫ్రీక్వెన్సీ, 1 లో-ఫ్రీక్వెన్సీ, 2 హై-ఫ్రీక్వెన్సీ స్పీకర్లు ఉన్నాయి. Dolby Atmos, Harman AudioEFX ట్యూనింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ప్లాట్‌ఫామ్: Google TV, క్వాడ్ కార్టెక్స్ A73 CPU, Mali-G52 (2EE) MC1 GPU, 4GB RAM, 64GB ROM.
కనెక్టివిటీ: బ్లూటూత్ 5.2, Wi-Fi 6, 3× HDMI 2.1 (CEC/ALLM/VRR/eARC), 2× USB (2.0 & 3.0), ఈథర్‌నెట్, ఆప్టికల్ ఆడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్.
డిజైన్: ఫ్రేమ్‌లెస్ బౌండ్‌లెస్ డిస్‌ప్లే, డబుల్ స్టాండ్.
ధర: Xiaomi TV S Pro Mini LED సిరీస్ 2026 మోడల్ 98 అంగుళాల మోడల్ ధర 7,599 యువాన్లు (రూ. 93,625) గా నిర్ణయించబడింది. ఇది ప్రస్తుతం ప్రీ-సేల్‌కు అందుబాటులో ఉంది. అతి త్వరలోనే వీటి అమ్మకాలు చైనాలో ప్రారంభం కానున్నాయి.