Leading News Portal in Telugu

HMD Fusion 2 Launch: 108MP Camera, Snapdragon 6s Gen 4, 120Hz Display & IP65 Rating


HMD Fusion 2: హెచ్‌ఎండీ (HMD) సంస్థ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 (HMD Fusion 2)ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్పెసిఫికేషన్లు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. ఈ హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో విడుదల కానుంది. దీని డిస్‌ప్లేలో 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6S జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఇది కాకుండా, LED ఫ్లాష్, అనేక కెమెరా ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి.

Vitamin D Tablets: విటమిన్ డి ట్యాబ్లెట్స్‌తో మూత్రపిండాలకు ఎఫెక్ట్!

ఈ కొత్త హెచ్‌ఎండీ ఫోన్ IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ (ధూళి మరియు నీటి నిరోధకత) సపోర్ట్‌తో పాటు.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా, ఇది ఆండ్రాయిడ్ 16తో లాంచ్ అవుతుంది, భవిష్యత్తులో ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. అలాగే, స్టీరియో స్పీకర్లు ఉండటం వల్ల మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2లో 5500mAh బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ డిజైన్‌పై కూడా హెచ్‌ఎండీ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ అన్ని అద్భుతమైన ఫీచర్లతో కూడిన హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో విడుదల కానుంది.

Hydrogen Water Bottle: ఏందయ్యా ఇది.. నీళ్ల సీసా ధర రూ.9,999 !