Leading News Portal in Telugu

Lava announces its latest budget smartphone SHARK 2 4G


  • 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా
  • లావా షార్క్ సిరీస్‌లో సరికొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ విడుదల

లావా షార్క్ సిరీస్‌లో సరికొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ లావా షార్క్ 2 4G పేరిట ప్రవేశపెట్టింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే, అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ఫోన్ ధర. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ హ్యాండ్ సెట్ 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో Android 15 పై రన్ అవుతుంది. ఇందులో 1.8GHz ఆక్టా-కోర్ UNISOC T7250 12nm ప్రాసెసర్, Mali-G57 MP1 GPU శక్తినిస్తుంది. 4GB వరకు RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు ఎక్పాండెబుల్ స్టోరేజ్ ను కూడా అందిస్తుంది.

కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఈ హ్యాండ్ సెట్ 50MP వెనుక కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, 8MP ముందు వైపు కెమెరా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్‌తో FM రేడియో, బాటమ్-పోర్టెడ్ స్పీకర్ కూడా ఉన్నాయి. ఈ పరికరం డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n (2.4GHz), బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C లకు మద్దతు ఇస్తుంది. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. లావా షార్క్ 2 4G ధర రూ. 6,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ నుంచి అన్ని లావా రిటైల్ స్టోర్లలో సేల్ కు అందుబాటులో ఉంటుంది.