Mecturing MopX2: ఇంటి పనులను సులభతరం చేసేందుకు మెక్చరింగ్ (Mecturing) సంస్థ భారతదేశంలో సరికొత్త MopX2 రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను విడుదల చేసింది. ఇది అత్యాధునిక AI ఫీచర్లతో పాటు.. శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్‌తో ఇది సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. మరి దీని పూర్తి ఫీచర్లను చూసేద్దామా..
అత్యాధునిక AI సాంకేతికతతో పాటు శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్‌తో ఈ MopX2 రోబోట్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇందులో ఉన్న డ్యూయల్ రోటేటింగ్ మాప్స్ నేలపై గట్టిగా రుద్దుతూ 20 న్యూటన్ల స్క్రబ్బింగ్ ఫోర్స్‌ను అందిస్తాయి. దీనితో మొండి మరకలను సులభంగా తొలగిస్తుంది. అలాగే 15,000 Pa వరకు శక్తివంతమైన సక్షన్ పవర్‌తో దుమ్ము, ధూళిని సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. ఆటోమేటిక్ డస్ట్ కలెక్టర్ సిస్టమ్‌తో MopX2 క్లీనింగ్ పూర్తయిన వెంటనే డస్ట్‌బిన్‌ను దానంతట అదే ఖాళీ చేసుకుంటుంది, తద్వారా చేతితో శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉండదంటే నమ్మండి.
8,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్, 165Hz స్క్రీన్‌తో వచ్చేస్తున్న OnePlus Turbo స్మార్ట్ ఫోన్..!
ఇక నావిగేషన్ పరంగా చూస్తే ఇందులో NavPro 4 LiDAR సిస్టమ్ ఉంది. దీని సహాయంతో గది కొలతలతో మ్యాప్‌లను ఖచ్చితంగా రూపొందిస్తుంది. ఇది ఐదు మ్యాప్‌ల వరకు సేవ్ చేయగల మల్టీ లెవల్ మ్యాపింగ్ ఫీచర్‌తో వస్తోంది, అందువల్ల ఎక్కువ అంతస్తుల ఇళ్లకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది 5,200 mAh బ్యాటరీతో వస్తుండగా.. ఇది ఒక్క ఛార్జ్‌పై 300 నిమిషాల వరకు పనిచేస్తూ.. సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని శుభ్రం చేయగలదని కంపెనీ చెబుతోంది. ఇందులోని కార్పెట్ స్మార్ట్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా రోబోట్ కార్పెట్ పైకి వెళ్ళగానే సక్షన్‌ను ఆటోమేటిక్‌గా పెంచుతుంది. అలాగే కార్పెట్ తడి కాకుండా ఉండేందుకు మాపింగ్ను తాత్కాలికంగా ఆపివేస్తుంది.
వీటితోపాటు యాంటీ ఫాల్, యాంటీ కొలిజన్ సెన్సార్లు రోబోట్‌కు సురక్షిత నావిగేషన్‌ను అందిస్తాయి. గదుల మూలలు, స్కర్టింగ్ లైన్స్‌ను కూడా శుభ్రం చేసే ప్రత్యేక ఎడ్జ్ క్లీనింగ్ మోడ్ ఇందులో ఉంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. Mecturing MopX2 రూ.34,999గా నిర్ణయించబడింది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక దీని అమ్మకాలు నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. MopX2 రోబోట్ వాక్యూమ్ 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు, 10 సంవత్సరాల వాటర్‌ప్రూఫ్ మోటార్ వారంటీతో లాంచ్ అయ్యింది.
Abdullahpurmet: హైటెన్షన్ డ్రామా.. విద్యుత్ టవర్ పై నుండి దూకేసిన వ్యక్తి…!