OnePlus Turbo: వన్‌ప్లస్ సంస్థ ‘ప్యూర్ పర్ఫార్మెన్స్’ లక్ష్యంగా సరికొత్త సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus Ace 6 (OnePlus 15R) మోడల్స్‌తో పాటుగా.. ఇప్పుడు OnePlus Turbo పేరుతో ఒక అల్ట్రా-పవర్ఫుల్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ వివరాల ప్రకారం.. ఈ OnePlus Turbo ఫోన్ అతిపెద్ద చెప్పుకోతగ్గ విషయం 8,000mAh బ్యాటరీ. ఇప్పటివరకు ఏ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లోనూ లేనంత అతిపెద్ద బ్యాటరీ ఇదే కావడం విశేషం. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.
Harish Rao: 3 వేల కోట్లలలో ఢిల్లీకి వాటా.. ప్రభుత్వంపై మాజీమంత్రి ఫైర్..!
ఇక ఈ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో రానుంది. క్వాల్కామ్ నుంచి త్వరలో విడుదల కానున్న ఈ చిప్, మొబైల్ గేమింగ్, పర్ఫార్మెన్స్ను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. థర్మల్స్‌ను సమర్థంగా నిర్వహించేందుకు “గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్”ను కూడా ఇందులో పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ OnePlus Turbo 6.7 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్, అత్యధికమైన 165Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
Abdullahpurmet: హైటెన్షన్ డ్రామా.. విద్యుత్ టవర్ పై నుండి దూకేసిన వ్యక్తి…!
ఇక కెమెరా విషయానికి వస్తే.. OnePlus Turbo వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. ఇతర ఫీచర్లలో మెరుగైన హ్యాప్టిక్స్ (Haptics) కోసం X-యాక్సిస్ లీనియర్ మోటార్, స్టీరియో స్పీకర్లు, NFC, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. లీకైన రిపోర్ట్ ప్రకారం OnePlus Turbo హ్యాండ్‌సెట్‌ను వన్‌ప్లస్ ఇప్పటికే భారత్‌లో టెస్టింగ్ చేస్తోంది. కంపెనీ ప్రణాళికలు అనుకున్నట్లు జరిగితే.. రాబోయే రెండు నెలల్లోనే ఈ ఫోన్ దేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై వన్‌ప్లస్ నుంచి అధికారిక లాంచ్ తేదీ మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.