Leading News Portal in Telugu

OnePlus 15 Launched with Snapdragon 8 Elite Gen 5, 7300mAh Glacier Battery & 50MP Triple Cameras


  • వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్
  • 6.78 అంగుళాల 1.5K AMOLED LTPO డిస్‌ప్లే తో, 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్.
  • Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్‌, కొత్త Glacier Cooling System తో వేడి తగ్గింపు
  • ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ — మెయిన్, అల్ట్రా వైడ్, 3.5x పెరిస్కోప్ లెన్స్‌లు.
  • 7300mAh Glacier Battery, 120W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
  • IP66/68/69/69K రేటింగ్స్ తో నీరు, ధూళి నిరోధకత.

OnePlus 15 Launch: వన్‌ప్లస్ సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 (OnePlus 15)ను చైనాలో లాంచ్ చేసింది. అత్యాధునిక డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, భారీ గ్లేసియర్ బ్యాటరీ, అద్భుత కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇది భారత మార్కెట్‌లో కూడా త్వరలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తున్న తొలి ఫోన్‌గా రానుంది. ఇక మరి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ OnePlus 15 పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

డిస్‌ప్లే:
ఈ కొత్త OnePlus 15లో 6.78 అంగుళాల 1.5K AMOLED LTPO డిస్‌ప్లే ఉంది. దీని 1.15mm సన్నని బెజెల్స్ ఫోన్‌కి అద్భుత లుక్‌ని ఇస్తాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూడో తరం ఓరియెంటల్ స్క్రీన్ టెక్నాలజీని ఇందులో వాడారు. 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఈ డిస్‌ప్లే, WeChat, QQ, Xiaohongshu, Weibo వంటి ప్రముఖ యాప్‌ల్లో కూడా హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తుంది. అలాగే DisplayMate A++ రేటింగ్, 1నిట్ డార్క్ నైట్ మోడ్ వంటి ఐ కేర్ ఫీచర్లతో కళ్లకు సౌకర్యవంతంగా పనిచేస్తుంది.

7800mAh బ్యాటరీ, క్రేజీ ఫీచర్స్, IP66/68/69/69K రేటింగ్స్ తో OnePlus Ace 6 లాంచ్.!

Image

పర్ఫార్మెన్స్:
పనితీరులో OnePlus 15 అసలు ఎక్కడ రాజీ పడలేదు. ఇది Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ మరింత చల్లగా, స్థిరంగా పనిచేస్తుంది. హ్యాండ్ టీరబుల్ స్టీల్, ఏరోస్పేస్ గ్రేడ్ సూపర్ క్రిటికల్ ఏరోజెల్ వంటి పదార్థాలను ఉపయోగించడం ద్వారా వేడి తగ్గింపులో విప్లవాత్మక ఫలితాలు సాధించింది. అలాగే G2 గేమింగ్ నెట్‌వర్క్ చిప్‌ ద్వారా నెట్‌వర్క్ లేటెన్సీని 65.85% వరకు తగ్గించి, ప్రొ లెవెల్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Image (1)

కెమెరా, బ్యాటరీ:
కెమెరా విభాగంలో ఈ ఫోన్ మూడు 50MP సెన్సార్లతో మెప్పిస్తుంది. ఇందులో సోనీ 50MP మెయిన్ సెన్సార్ (OIS), 50MP అల్ట్రా వైడ్, 50MP 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లతో వస్తుంది. ఇవి 4K 120fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండటం ప్రత్యేకత. అలాగే దీనికి 32MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయంలో 7300mAh గ్లేసియర్ బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణ. ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌లో 6 గంటల స్ట్రీమింగ్ సమయాన్ని ఇస్తుంది. డ్యూన్, అబ్సొల్యూట్ బ్లాక్, మిస్టీ పర్పుల్ వంటి రంగుల్లో లభించే ఈ ఫోన్ IP66/68/69/69K రేటింగ్‌తో నీటి, ధూళి నిరోధకతలనూ ముందంజలో ఉంది.

Kantara Chapter 1 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా వసూళ్లు.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.?

ఇక ధర విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15 చైనాలో మూడు వేరియంట్లలో లభిస్తోంది. 12GB + 256GB వేరియంట్‌ ధర 3999 యువాన్‌ (రూ.49,540), 16GB + 256GB వేరియంట్‌ ధర 4299 యువాన్‌ (రూ.53,255) ఇక టాప్ వేరియంట్ 16GB + 1TB వేరియంట్‌ ధర 5399 యువాన్‌ (రూ.66,890)గా ఉంది. ఈ ఫోన్‌ విక్రయాలు అక్టోబర్ 28 నుంచి చైనాలో ప్రారంభమవుతాయి. భారత మార్కెట్‌లో దీని లాంచ్ నవంబర్‌ మధ్యలో జరగనున్నట్లు వన్‌ప్లస్ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది.

Image (2)