Leading News Portal in Telugu

OnePlus Ace 6 Launched with 7800mAh Battery, Snapdragon 8 Elite, 165Hz Display and IP69K Rating


OnePlus Ace 6: వన్‌ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్‌ OnePlus 15 తో పాటు చైనా మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ OnePlus Ace 6 ను కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 60Hz నుంచి 165Hz వరకు స్మార్ట్‌గా స్విచ్ అయ్యే వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో “Bright Eye Protection” టెక్నాలజీతో పాటు “Little Gold Label” ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉండడం వల్ల మొబైల్ ఎక్కువకాలం ఉపయోగించినా కళ్లకు ఒత్తిడి పెరగదు. ఇక ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్ అందుబాటులో ఉంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Wind Chip Gaming Core సిస్టమ్ 165Hz అన్‌లిమిటెడ్ ఫుల్ ఫ్రేమ్ రేట్‌తో మరింత స్మూత్ అనుభూతిని ఇస్తుంది. అలాగే “Touch and Display Sync” వంటి ఫీచర్‌తో టచ్ స్పందన వేగంగా, ఖచ్చితంగా ఉంటుంది. షూటింగ్ సమయంలో మరింత స్థిరత కోసం ఫ్లాగ్‌షిప్‌ స్థాయి Gyroscope సెన్సిటివ్ ట్రాకింగ్ కూడా అందించారు. ఇక అధిక వేడి సమస్యను తగ్గించేందుకు Glacier కూలింగ్ సిస్టంను వన్‌ప్లస్ ఈ మోడల్‌లో ఉపయోగించింది.

Geyser Safety Tips: గీజర్ వాడుతున్నారా? అయితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి!

Image (1)

ఇక డిజైన్ పరంగా OnePlus Ace 6 ప్రీమియం ఫినిష్‌తో ఆకట్టుకుంటుంది. కాంపిటీటివ్ బ్లాక్, ఫ్లాష్ వైట్, క్విక్ సిల్వర్ రంగుల్లో లభించే ఈ ఫోన్ “మైక్రో గ్రాడియంట్ సిల్క్ గ్లాస్” ఫినిష్‌తో, మెటల్ ఫ్రేమ్ మరియు OnePlus 15తో సమానమైన “మెటల్ క్యూబ్” డిజైన్‌తో స్టైలిష్ లుక్ తో ఉంటుంది. ఇక మొబైల్ కు IP66/68/69/69K రేటింగ్‌తో నీరు, ధూళి నుంచి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. అలాగే ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, “Rain Touch” ఫీచర్‌, సోనీ 50MP మెయిన్ కెమెరా, హై-పర్ఫార్మెన్స్ X-ఆక్సిస్ వైబ్రేషన్ మోటార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, NFC, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి అన్ని ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రధాన కెమెరా (OIS), 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇవి 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్‌ భాగంలో 16MP కెమెరా సెల్ఫీల కోసం అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా Android 16 ఆధారిత ColorOS 16 పై నడుస్తుంది. 7800mAh బ్యాటరీతో వస్తున్న OnePlus Ace 6, 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 16 నిమిషాల్లో 50% ఛార్జ్, అలాగే 10 నిమిషాల్లో 3.3 గంటల గేమ్‌ప్లే పొందవచ్చని కంపెనీ చెబుతోంది. “Bypass Power”, “In-Game Recharge” వంటి స్మార్ట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్లు ఇందులోని ప్రత్యేకతలు.

Kantara Chapter 1 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా వసూళ్లు.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.?

Image (2)

ఇక OnePlus Ace 6 ధర విషయానికి వస్తే.. ఇది అనేక వేరియంట్లలో లభ్యమవుతోంది. 12GB + 256GB వేరియంట్‌ ధర 2599 యువాన్స్ (రూ.32,200), 16GB + 256GB వేరియంట్‌ ధర 2899 యువాన్‌ (రూ.35,900), 12GB + 512GB మోడల్‌ ధర 3099 యువాన్‌ (రూ.38,400)గా ఉంది. ఇక 16GB + 512GB వేరియంట్‌ 3399 యువాన్‌ (రూ.42,100), ఇక టాప్ ఎండ్ 16GB + 1TB వేరియంట్‌ 3899 యువాన్‌ (రూ.48,300)కి లభిస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 30 నుండి చైనాలో అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇదే మోడల్‌ భారత మార్కెట్‌లో OnePlus 15R పేరుతో మరింత మెరుగైన కెమెరా స్పెసిఫికేషన్లతో విడుదల కానుందని సమాచారం.