Leading News Portal in Telugu

Moto G67 Power with Military-Grade Durability, 7000mAh Battery, and Snapdragon 7s Gen 2 Set to Launch on November 5 in India


Moto G67 Power: మోటరోలా (Motorola) ‘జీ పవర్’ (g Power) సిరీస్‌లో భాగంగా మరో సంచలన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. కొన్ని నెలల క్రితం జీ86 పవర్ (g86 Power)ను విడుదల చేసిన తర్వాత ఇప్పుడు మోటో జీ67 పవర్ (Moto G67 Power) స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టు ధృవీకరించింది. ఈ కొత్త ఫోన్ గురించి మోటరోలా ఇచ్చిన వివరాలు చూస్తే.. ముందుముందు ఈ మొబైల్ ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో అర్థమవుతుంది.

అందిన సమాచారం ప్రకారం ఇందులో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ (Silicon Carbon Battery) ఉండడం దీని మెయిన్ ఆకర్షణ. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 58 గంటల వరకు నిరంతరాయంగా ఉపయోగించవచ్చని కంపెనీ హామీ ఇస్తోంది. ఇక ఫోన్ పనితీరు విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC (Snapdragon 7s Gen 2 SoC) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో అద్భుతమైన వేగాన్ని, సామర్థ్యాన్ని అందిస్తుంది.

Montha Cyclone: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాలోని సూళ్లకు సెలవులు

ఇక కెమెరా ప్రియులకు ఈ మొబైల్ నిజంగా పండుగే. మోటో జీ67 పవర్‌లో వెనుకవైపు 50MP Sony LYT-600 సెన్సార్ (Sony LYT-600 Sensor) తో కూడిన ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా (Ultra-Wide Camera) ఉన్నాయి. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా (Front Camera) అమర్చారు. ఈ అన్ని కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్ చేయగల సామర్థ్యం ఇందులో ఉండడం విశేషమే అని చెప్పాలి.

Image

ఇక డిజైన్, మన్నిక పరంగా మోటరోలా రాజీ పడనట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల FHD+ 120Hz స్క్రీన్‌తో వస్తుంది. దీనికి అదనపు రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i (Corning Gorilla Glass 7i) ఉపయోగించారు. ఇది IP64 రేటింగ్ (IP64 Rating)తో ధూళి, నీటి తుంపరల నిరోధకతను కలిగి ఉంది. అంతేకాక, ఈ ఫోన్ MIL-810H మిలిటరీ -గ్రేడ్ మన్నిక (MIL-810H Military-Grade Durability) ధృవీకరణను కలిగి ఉండడం దీని బలాన్ని తెలియజేస్తుంది. వీగన్ లెదర్ ఫినిషింగ్ (Vegan Leather Finish), ప్యాంటోన్ (Pantone) ఎంపిక చేసిన మూడు ప్రత్యేక రంగులలో ఈ ఫోన్ లభించనుంది. అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సదుపాయం కూడా ఉంది.

CM Revanth Reddy : అందరూ అలర్ట్.. మొంథా తుపాన్ ప్ర‌భాపై ముఖ్య‌మంత్రి ఆరా…

మోటో జీ67 పవర్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా, త్వరలోనే ఆండ్రాయిడ్ 16 (Android 16) అప్‌డేట్‌ను అందిస్తామని కంపెనీ స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ కొత్త మోటో జీ67 పవర్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ (Flipkart), motorola.in వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. నవంబర్ 5న ఫోన్ అధికారికంగా విడుదలైనప్పుడే దాని ధర వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది.

Image (1)