- చైనాలో ఇప్పటికే వన్‌ప్లస్ 15 లాంచ్
- భారత్ లాంచ్ డేట్ వచ్చేసింది
- Mind Spaceకి వన్‌ప్లస్ 15 కనెక్ట్
OnePlus 15 India Launch Date and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15ను చైనాలో ఇప్పటికే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. చైనా రిలీజ్ సమయంలో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ తేదీని ప్రకటిస్తామని చెప్పింది. ఈ క్రమంలో బుధవారం లాంచ్ డేట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా OnePlus 15 5G స్మార్ట్‌ఫోన్ నవంబర్ 13న లాంచ్ అవుతుంది. అమ్మకాలు కూడా అదే రోజున ప్రారంభమవుతాయి. భారతదేశంలో నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు వన్‌ప్లస్ 15 లాంచ్ అవుతుంది. అమ్మకాలు అదే రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

OnePlus 15 Display:
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 16GB LPDDR5X RAMతో వచ్చింది. 6.78-అంగుళాల OLED డిస్‌ప్లే ఉండగా.. 165Hz వేగవంతమైన రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 1800 నిట్‌లు. ఇది అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కంపెనీ ఈసారి AIపై దృష్టి పెట్టింది. చాల ఫీచర్లు AIతో వచ్చాయి.ఈ ఫ్లాగ్‌షిప్‌లో Google Geminiని పోందుపర్చింది. దీని వలన ఇది Mind Spaceకి కనెక్ట్ అవుతుంది.

OnePlus 15 Camera:
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మూడు బ్యాక్ కెమెరాలు 50-మెగాపిక్సెల్తో వచ్చాయి. 50 ఎంపీ సోనీ IMX906 OIS ప్రధాన కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్స్, టెలిఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది.సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 120x డిజిటల్ జూమ్, 3.5x ఆప్టికల్ జూమ్ కలిగి ఉంది.

OnePlus 15 OS:
వన్‌ప్లస్ 15 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ OS16పై రన్ అవుతుంది. ఒప్పో Color OS చైనాలోని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఉన్నప్పటికీ.. భారతదేశంలో ఆక్సిజన్ OS మాత్రమే ఉంటుంది. ఇది Color OS కంటే మెరుగ్గా ఉంటుంది.

OnePlus 15 Battery:
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌లో 7,300mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది.

OnePlus 15 Price:
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌లో చైనాలో 3,999 యువాన్లకు లాంచ్ అయింది. అయితే టాప్ వేరియంట్ ధర 5,399 యువాన్ల వరకు ఉంది. కంపెనీ 1TB వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. భారతదేశంలో వన్‌ప్లస్ 15 ప్రారంభ ధర 50,000 రూపాయల వరకు ఉండవచ్చు.ఈరోజు రాత్రి ధరపై క్లారిటీ రానుంది.