- కొత్త ఫీఛర్ ను విడుదల చేసిన మహీంద్రా, శాంసంగ్
- మహీంద్రా eSUVకి మాత్రమే పనిచేయనున్న ఫీచర్
డిజిటల్ కార్ కీని సంబంధించిన కొత్త ఫీఛర్ ను విడుదల చేస్తున్నట్లు శామ్సంగ్ ఇండియాకు చెందిన మధుర్ చతుర్వేది, మహీంద్రా ఎలక్ట్రిక్‌కు చెందిన శ్రుతి అగర్వాల్ ప్రకటించారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Samsung బుధవారం Samsung Wallet ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ SUVలతో డిజిటల్ కార్ కీ అన్ లాకింగ్ ఫీచర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది, కార్ల యజమానులకు వారి వాహనాలను అన్‌లాక్ చేయడానికి, లాక్ చేయడానికి మరియు స్టార్ట్ చేయడానికి వారి Galaxy స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుందని మధుర్ చతుర్వేది తెలిపారు.
ఈ ఫీచర్ ద్వారా ఫిజికల్ కీ లేకుండా ఫోన్‌తోనే కారును స్టార్ట్ చేయడం, అన్ లాక్ చేయడం లాంటివి చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఇది మహీంద్రా ఎలక్ట్రికల్ ఎస్‌యూవీ వాహనాలకు మాత్రమే పనిచేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ కార్ కీ పేరుతో గెలాక్సీ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తోంది. “మహీంద్రా eSUV యజమానులకు Samsung Wallet ద్వారా Samsung డిజిటల్ కీ యొక్క అద్భుతమైన సౌలభ్యాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నామన్నారు చతుర్వేది . Samsung డిజిటల్ కార్ కీకి యాక్సెస్‌ను విస్తరించడం అనేది Galaxy పర్యావరణ వ్యవస్థలో కనెక్ట్ చేయబడిన , సురక్షితమైన అనుభవాలను అందించాలనే మా నిబద్ధతలో ముఖ్యమైన భాగం” అని చతుర్వేది అన్నారు.
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, అల్ట్రా వైడ్ బ్యాండ్, టెక్నాలజీల సాయంతో ఇది పనిచేస్తుంది. కార్ మోడల్ ఆధారంగా డిజిటల్ కీ అనుసంధానం అవుతుంది. అంతే కాకుండా ఒకసారి ఫోన్ లోని యాప్ తో పెయిర్ చేసిన తరవాత యూజర్ ఫోన్ ను కారుకు దగ్గరగా తీసుకెళ్లగానే ఆటోమెటిక్‌గా అన్ లాక్ అవుతుంది. డిజిటల్ కీ యాప్ ద్వారా ఇతరులకు సైతం కారు యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫోన్ పోగొట్టుకుంటే లేదా మర్చిపోతే శాంసంగ్ ఫైండ్ సర్వీసెస్ ద్వారా రిమోట్ గా కీ ని లాక్ చేయవచ్చు, లేదంటే పూర్తిగా తొలగించవచ్చు.