Leading News Portal in Telugu

vivo Y19s 5G Launched in India with 6000mAh Battery, 6000mah battery and Military-Grade Durability


Vivo Y19s 5G: వివో భారత్‌లో తన తాజా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Y19s 5G ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Y19e 4G మోడల్ తరువాత Y సిరీస్‌లో మరో ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ SGS, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు పొందింది. దీంతో ఇది కింద పడి పోవడం, షాక్‌లు, ఇతర కఠిన పరిస్థితుల్లో కూడా భద్రంగా పనిచేసేలా రూపొందించబడింది. అంతేకాకుండా మొబైల్ IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ పొందుతుంది.

Chevella Accident Causes: బస్సు ప్రమాదానికి 12 ప్రమాద కారణాలు ఇవే..!

వివో Y19s 5Gలో 6.74 ఇంచుల HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక పనితీరులో ఇది Octa-Core MediaTek Dimensity 6300 (6nm) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఫోన్‌లో 4GB లేదా 6GB LPDDR4X ర్యామ్, అలాగే 64GB లేదా 128GB స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పై పనిచేస్తుంది. ఇక ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (f/2.2), అలాగే 0.08 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ (f/3.0) ఉన్నాయి. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా (f/2.2) ఇవ్వబడింది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కల్పించారు.

CWC 2025: దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ ప్రపంచ రికార్డులు!

ఈ కొత్త వివో స్మార్ట్ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉండి 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఇది 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), Bluetooth 5.2, GPS/GLONASS/QZSS, USB Type-C వంటి ఆధునిక ఆప్షన్లను కలిగి ఉంది. వివో Y19s మొబైల్ 199 గ్రాముల బరువుతో వస్తుంది. వివో Y19s 5G మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 4GB + 64GB మోడల్ ధర రూ.10,999గా, 4GB + 128GB మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించగా, టాప్ ఎండ్ 6GB + 128GB మోడల్‌ను రూ.13,499కి విడుదల చేసింది. ఈ ఫోన్ మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉండగా.. త్వరలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.