REDMAGIC 11 Pro: REDMAGIC సంస్థ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ REDMAGIC 11 Pro ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్లోబల్ వెర్షన్‌లో స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేకపోయినా.. చార్జింగ్ విషయంలో చిన్న తేడా కనపరిచారు. చైనా వెర్షన్‌లో ఉన్న 120W ఫాస్ట్ ఛార్జింగ్ స్థానంలో గ్లోబల్ వెర్షన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ క్రయో, నైట్ ఫ్రీజ్, సబ్ జీరో అనే మూడు ఆకర్షణీయమైన ఫినిషింగ్ లలో లభిస్తుంది.
AP Private Bus Accidents: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరు మృతి..
ఇక ఈ కొత్త స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.85 అంగుళాల 1.5K OLED BOE X10 డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్, Adreno 840 GPU తో పనిచేస్తుంది. ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో 12GB/16GB/24GB LPDDR5T ర్యామ్ తో పాటు 256GB/512GB/1TB UFS 4.1 ప్రో స్టోరేజ్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక కెమెరా విభాగంలో ఫోన్ వెనుక 50MP ప్రధాన సెన్సార్ (OISతో), 50MP 120° అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఓమ్ని విజన్ అండర్ డిస్‌ప్లే కెమెరా అందించబడింది.
RazeshDanda : మీడియాకు, వెబ్ సైట్ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పిన K RAMP నిర్మాత
బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 7500mAh సామర్థ్యమున్న బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్లు, Wi-Fi 7, IPX8 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత REDMAGIC OS 11 పై నడుస్తుంది. REDMAGIC 11 ప్రో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 12GB+256GB మోడల్ US$749 (రూ.66,505), 16GB+512GB మోడల్ US$849 (రూ.75,385), 24GB+1TB మోడల్ US$999 (రూ.88,705) గా నిర్ణయించారు.
The Future of Cooling Starts Here | REDMAGIC 11 Pro
— REDMAGIC (@redmagicgaming) October 20, 2025