Leading News Portal in Telugu

Apple MacBook Air M4 gets over Rs. 17,000 discount


  • Apple MacBook Air M4 పై రూ.17,000 పైగా డిస్కౌంట్
  • 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్

ఆపిల్ మ్యాక్ బుక్ Air M4 పై ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.17వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఇందులో Apple శక్తివంతమైన M4 ప్రాసెసర్ ఉంది. MacBook Air M4 16GB RAM + 256GB SSD వేరియంట్ రూ. 99,900 కు విడుదలైంది. అయితే, విజయ్ సేల్స్ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 92,400 ప్రారంభ ధరకు లిస్ట్ చేసింది. ఈ ధర MacBook Air M4 స్కై బ్లూ కలర్ వేరియంట్ కోసం. అంటే దీనికి రూ. 7,500 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.

అదనంగా, మీరు బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 10,000 తగ్గింపును పొందొచ్చు. ప్లాట్‌ఫామ్‌లో ICICI బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వలన రూ. 10,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీని అర్థం రూ. 17,500 ఆదా అవుతుంది. కలర్ వేరియంట్‌ను మార్చడం వల్ల హ్యాండ్ సెట్ ధర కూడా ప్రభావితమవుతుందని గుర్తుంచుకోండి. ఇది 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఇది సెంటర్ స్టేజ్, డెస్క్ వ్యూ వంటి లక్షణాలతో 12MP వెబ్‌క్యామ్‌ను కూడా కలిగి ఉంది.