Moto G67 Power 5G: మోటరోలా (Motorola) కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G67 Power 5G ను భారత మార్కెట్లో నేడు (నవంబర్ 5) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మోటరోలా అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. మిడ్ రేంజ్ విభాగానికి చెందిన ఈ ఫోన్ ముఖ్యంగా భారీ బ్యాటరీ, ప్రాసెసర్, మంచి కెమెరా పనితీరుతో ఆకట్టుకోనుంది. ఇక పనితీరు పరంగా చూస్తే Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 (4nm) ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 8GB ర్యామ్ తో వస్తుంది. అలాగే 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. వీటితోపాటు RAM బూస్ట్ ఫీచర్ సహాయంతో ర్యామ్‌ను 24GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX పై పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 అప్డేట్ను కంపెనీ హామీ ఇస్తోంది.
Women’s Team to Meet PM: నేడు మోడీని కలవనున్న భారత మహిళల క్రికెట్ ప్లేయర్స్..
ఈ ఫోన్ లో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది దాదాపు 58 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని మోటరోలా తెలిపింది. ఫోన్ 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విభాగంలో Moto G67 Power 5Gలో 50 మెగాపిక్సెల్ (f/1.8) సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనికి AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ఇంజిన్ సపోర్ట్ ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-ఇన్-1 ఫ్లికర్ కెమెరా కూడా ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ (f/2.2) సెల్ఫీ కెమెరా హోల్-పంచ్ డిజైన్‌లో అమర్చబడింది. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను అందిస్తాయి.
SRH IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిస్క్ చేయబోతుందా.. రూ.23 కోట్ల స్టార్ రిటెన్షన్ జాబితాలోకి..?
ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్-HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ కలిగి ఉంది. డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ 7i రక్షణను అందించారు. అలాగే ఫోన్ MIL-810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్.. IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి తుంపరల నుండి రక్షణను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో వీగన్ లెదర్ ఫినిష్ ఉండటంతో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. Moto G67 Power 5G పాంటోన్ పారాచూట్ పర్పుల్, పాంటోన్ బ్లూ కురాకో, పాంటోన్ సిలాంట్రో అనే మూడు ఆకర్షణీయమైన పాంటోన్ క్యూరేటెడ్ షేడ్స్‌లో లభిస్తుంది.
Power. Performance. Precision. ⚡
The all-new #motoG67POWER packs a 7000mAh Silicon-Carbon battery, 50MP Sony LYT-600 camera with 4K on all lenses, and Snapdragon® 7s Gen 2 power — all on a 6.7” 120Hz FHD+ display with Gorilla Glass 7i.
Launching Nov 5 at ₹14,999* on Flipkart. pic.twitter.com/qJiKvFAdP8— Motorola India (@motorolaindia) November 4, 2025