Leading News Portal in Telugu

Vivo Y500 Pro with 200MP Camera, 7000mAh Battery, IP68+IP69 Protection to Launch on November 10


Vivo Y500 Pro: వివో సంస్థ ఇప్పటికే రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను టీజ్ చేయడంతో పాటు.. ఆ మొబైల్ సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ధృవీకరించింది. ఆ మొబైల్ ఏదో కాదు.. ఇది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన Vivo Y500 సిరీస్‌లో కొత్త మోడల్‌గా చేరనుంది. నివేదికల ప్రకారం Vivo Y500 Pro నవంబర్ 10న చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) అధికారికంగా లాంచ్ కానుంది.

New York Mayor Elections: ట్రంప్‌కు భారీ షాక్.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం

డిస్‌ప్లే విషయానికి వస్తే.. Vivo Y500 Pro 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను 1.5K రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. గేమింగ్ ప్రేమికులకు MOBA టైటిల్స్‌లో 120fps HD గేమ్‌ప్లే సపోర్ట్‌ను అందించగలదని వివో ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 తో వస్తుంది. దీనితో ఇది కొత్త సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌తో విడుదలైన మొదటి నాన్ ఫ్లాగ్‌షిప్ వివో ఫోన్‌గా నిలుస్తుంది. కెమెరా పరంగా Vivo Y500 Proలో 200 మెగాపిక్సెల్ Samsung HP5 ప్రైమరీ సెన్సార్‌ను అమర్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది.

Karthika Deepam: దీపారాధనలో 99 శాతం మంది ఈ తప్పులే చేస్తున్నారు!

ఇక ఈ ఫోన్‌లో 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్‌లతో దుమ్ముతో పాటు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. శాటిన్ ఫినిష్‌తో కూడిన యాంటీ గ్లేర్ గ్లాస్ బ్యాక్ దీని లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా చేస్తుంది. ఇక హార్డ్‌వేర్ విషయానికి వస్తే Vivo Y500 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో Vivo V2516A మోడల్ నంబర్‌తో దర్శనమిచ్చింది. ఇది MediaTek Dimensity 7400 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో రెండు క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ మొబైల్ గీక్‌బెంచ్ పరీక్షల్లో ఈ ఫోన్ సింగిల్-కోర్‌లో 1,059 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 3,006 పాయింట్లు సాధించింది.