Leading News Portal in Telugu

Moto G67 Power 5G Launched in India with 7000mAh Battery, Snapdragon 7s Gen 2, and Military-Grade Build at 15999


Moto G67 Power 5G: మోటరోలా తాజాగా Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ లో 7000mAh బ్యాటరీ, ఆధునిక ప్రాసెసర్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ కేవలం రూ.15,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. యువతను ఆకర్షించే స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ పనితీరు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌ ఈ ఫోన్ ప్రధాన హైలైట్‌లుగా నిలవనున్నాయి.

Bihar Elctions: రేపే బీహార్ తొలి విడత పోలింగ్.. బూత్‌లకు చేరుకుంటున్న సిబ్బంది

ఫోన్ పేరుకే తగ్గట్టుగా ఈ మొబైల్ ఒక పవర్‌హౌస్. 7000mAh పెద్ద బ్యాటరీ 3 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. ఇక ఇది 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కల్పించబడింది. క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 (4nm) ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఇది 2.4GHz వరకు క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇక ఇందులో 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్‌లో ‘RAM Boost’ ఫీచర్ ద్వారా వర్చువల్ ర్యామ్ ను 16GB వరకు పెంచుకోవచ్చు. ఇందులో 6.7 అంగుళాల FHD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 nits పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అందించారు.

Image (1)

ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP Sony LYT-600 సెన్సార్‌తో కెమెరా, అలాగే 8MP అల్ట్రా వైడ్ + మ్యాక్రో లెన్స్ కలిపి ఉన్న డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా 4K 30fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో అందించబడింది. ఇది కూడా 4K వీడియోలను రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌తో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించబడతాయి. డిజైన్ పరంగా ఇది వీగన్ లెదర్ ఫినిష్.. IP64 రేటింగ్ ద్వారా నీటి తుంపరలు, దుమ్ము నుండి రక్షణ కల్పిస్తుంది. ఇక ఈ మొబైల్ MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందడంతో దీని మన్నిక అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది.

Sunrisers Leeds: జట్టు పేరును మార్చేసిన కావ్య మారన్.. కొత్త పేరేంటంటే..?

ఇతర ముఖ్య ఫీచర్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6, మరియు 5G కనెక్టివిటీ ఉన్నాయి. Moto G67 Power 5G ఒకే వేరియంట్‌ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇది పాంటోన్ సిలాంత్రో (Cilantro), పాంటోన్ కురాకో బ్లూ (Curacao Blue), పాంటోన్ పారాచూట్ పర్పుల్ (Parachute Purple) అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ విక్రయాలు నవంబర్ 12 నుండి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్ సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. ప్రారంభ ఆఫర్లలో SBI, Axis కార్డులపై రూ.1,000 బ్యాంక్ తగ్గింపు లేదా రూ.1,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, అలాగే 3 లేదా 6 నెలల నో కాస్ట్ EMI సౌకర్యం లభిస్తుంది.