Leading News Portal in Telugu

Government Warns Against Non-Standard Phone Chargers | Check CRS Mark Before Buying


Government Warns Against Non-Standard Phone Chargers: ప్రస్తుత రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఛార్జర్‌లను అందించడం లేదు. దీంతో అనేక మంది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా బయటి నుంచి కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అవి కొన్ని సార్లు సరిగా పనిచేయవు. అలాంటి వాటితో స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల దాని ఛార్జింగ్ క్రమంగా తగ్గుతుంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ సంస్థ కన్స్యూమర్ అఫైర్స్ (జాగో గ్రాహక్ జాగో)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

READ MORE: Manchu Brothers : ఫ్యామిలీ గొడవలు పక్కన పెట్టి మళ్లీ ఒక్కటవ్వనున్న మంచు బ్రదర్స్?

“తరచూ ప్రజలు చౌకైన ఛార్జర్‌లను వెతుక్కుంటూ ఎటువంటి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లను కొనుగోలు చేస్తారు. ఈ నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లు మీకు, మీ స్మార్ట్‌ఫోన్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి . CRS మార్క్ లేకుండా స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కొనకండి. CRS మార్క్ లేని ఛార్జర్ మీ ఫోన్‌, మీరు ప్రమాదకరం.” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే CRS మార్క్ ఎలా ఉంటుందో వివరించారు.

READ MORE: Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్

నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లను గుర్తించడం ఎలా..?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు కొత్త వినియోగదారు అయితే యాప్‌లో మీ ప్రొఫైల్‌ని సృష్టించండి. మీరు హోమ్ స్క్రీన్‌లో సెర్చ్ దగ్గర BIS కేర్‌ని ఎంటర్ చేయండి. దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ క్రిందికి స్క్రోల్ చేసి R-Noని ధృవీకరించండి. ఆ తర్వాత కింద ఉన్న CRS ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీరు ఛార్జర్ R సంఖ్యను నమోదు చేయండి. ఇది అడాప్టర్‌పై వ్రాయబడి ఉంటుంది. దీని తర్వాత కొత్త స్క్రీన్ తెరవబడుతుంది. అక్కడ మీరు ఛార్జర్ అన్ని వివరాలను పొందుపరచండి. మీరు అడాప్టర్‌పై వ్రాసిన వివరాల నుంచి ఈ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.