Google Maps – Gemini AI: గూగుల్ మ్యాప్స్ (Google Maps) నావిగేషన్, లొకేషన్ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచేందుకు గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమిని (Gemini)తో జత కట్టింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా వినియోగదారులు డ్రైవింగ్‌పై దృష్టి పెట్టినట్టుగానే హ్యాండ్స్-ఫ్రీగా మ్యాప్స్‌తో మాట్లాడగలరు. అంతేకాకుండా.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇప్పుడు డ్రైవర్లు వాయిస్ కమాండ్‌లతోనే నావిగేషన్, సెర్చ్, ETA పంచుకోవడం, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లభ్యత సెర్చ్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్‌లు జోడించడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు.
ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ తో వచ్చేస్తున్న లెజెండ్ Tata Sierra SUV..!
కొత్తగా పొందుపరిచిన జెమిని ద్వారా ట్రాఫిక్ అంతరాయాలను కూడా వాయిస్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. అలాగే మ్యాప్స్ ఇప్పుడు ట్రాఫిక్ లైట్లు, స్టాప్ సైన్ లతో పాటు రూట్ వెంట ఉన్న రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, భవనాలు వంటి ల్యాండ్‌మార్క్‌లను కూడా చూపిస్తుంది. ఈ ఫీచర్ స్ట్రీట్ వ్యూ, 250 మిలియన్లకు పైగా ప్రదేశాల డేటాబేస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక ప్రోయాక్టివ్ ట్రాఫిక్ హెచ్చరికల ఫీచర్ ద్వారా వినియోగదారులు నావిగేషన్ యాక్టివ్‌గా ఉంచకపోయినా కూడా రోడ్డు మూసివేతలు, ట్రాఫిక్ జామ్‌లు వంటి సమాచారాన్ని ముందుగా తెలుసుకోగలరు. ఇక గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత లెన్స్ ద్వారా జెమినిని ఉపయోగించి చుట్టుపక్కల ప్రాంతాలను గుర్తించడం, ఆ ప్రాంతాల గురించి ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. ఇది కేవలం నావిగేషన్‌తో ఆగిపోకుండా ఆ స్థలం యొక్క అనుభవాన్ని (Experience) కూడా మెరుగుపరుస్తుంది.
చరిత్ర సృష్టించిన Maruti Suzuki India.. దేశంలో 3 కోట్ల కార్ల అమ్మకాలు..!