Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, టెస్లా వాటాదారులు ఆయనకు రాబోయే పదేళ్ల కాలానికి సుమారు $1 ట్రిలియన్ (ట్రిలియన్ డాలర్ల) జీతభత్యాల ప్యాకేజీని ఆమోదించడంతో మరింత సంపన్నుడుగా మారారు. ఈ భారీ ప్యాకేజీ ఆమోదం సందర్భంగా.. మస్క్ టెక్సాస్‌లోని టెస్లా వార్షిక సమావేశంలో తన కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ అయిన ‘ఆప్టిమస్’తో కలిసి డాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కొత్త వేతన ప్యాకేజీ ఆమోదం పొందిన వెంటనే.. మస్క్ ప్రేక్షకులను ఉద్దేశించి స్టేజిపైకి వచ్చి డ్యాన్స్ మూవ్ చేయగా ఆ రోబోట్ కూడా ఆయన కదలికలను అనుకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెత్తిన వైరల్ అవుతుంది. మస్క్ ప్రకారం.. ఆప్టిమస్ భవిష్యత్తులో తయారీ, డెలివరీలు, వ్యక్తిగత సహాయాన్ని కూడా నిర్వహించనుంది.
Prashant Kishor: 14న నేను చెప్పిందే నిజమవుతుంది.. పోలింగ్‌పై ప్రశాంత్ కిషోర్ జోస్యం
టెస్లా కేవలం కార్లలోనే కాకుండా.. రోబోటిక్స్, AI లో కూడా ఒక కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నట్లు పక్కనే ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్‌ను చూపిస్తూ ప్రకటించారు. టెస్లాను EV తయారీ సంస్థ నుంచి AI, రోబోటిక్స్ దిగ్గజంగా మార్చాలనే మస్క్ విజన్‌కు మద్దతు తెలుపుతూ వాటాదారులు ఆయనకు రాబోయే పదేళ్లలో $878 బిలియన్ల భారీ వేతన ప్యాకేజీని ఆమోదించారు. నార్వే సార్వభౌమ సంపద నిధితో సహా కొంతమంది ప్రధాన పెట్టుబడిదారుల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ ఆమోదం లభించింది. ఈ ప్యాకేజీ ఆమోదం పొందకపోతే మస్క్ కంపెనీని విడిచిపెట్టవచ్చని టెస్లా బోర్డు అభిప్రాయపడింది. ఈ భారీ ప్యాకేజీ, అదనపు బాధ్యతలు మస్క్ దృష్టిని తన ఇతర సంస్థలైన స్పేస్‌ఎక్స్, xAI పైకి మళ్లించడం గురించి పెట్టుబడిదారులలో ఉన్న ఆందోళనలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.
Arundhati Reddy: అతడి వల్లే వన్డే వరల్డ్ కప్‌ను గెలిచాం.. అరుంధతి రెడ్డి ఆసక్తికర విషయాలు!
ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపిన బోర్డు, అనేక మంది పెట్టుబడిదారులు ఈ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ దీర్ఘకాలంలో వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఎందుకంటే మస్క్ ఈ మొత్తం పొందాలంటే టెస్లా వరుసగా కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను సాధించాలి. కొత్త ప్రణాళిక ప్రకారం మస్క్ రాబోయే పదేళ్లలో టెస్లా స్టాక్‌లో $878 బిలియన్ల వరకు సంపాదించవచ్చు. ఈ లక్ష్యాలలో కంపెనీ 20 మిలియన్ల వాహనాలను పంపిణీ చేయడం.. 1 మిలియన్ రోబోటాక్సీలను నిర్వహించడం, 1 మిలియన్ రోబోలను విక్రయించడం ఇంకా కోర్ లాభంలో $400 బిలియన్ల వరకు సంపాదించడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. మస్క్‌కు ఈ మొత్తం చెల్లించబడాలంటే టెస్లా స్టాక్ విలువ ప్రస్తుత $1.5 ట్రిలియన్ల నుంచి మొదట $2 ట్రిలియన్లకు, ఆపై $8.5 ట్రిలియన్లకు పెరగాల్సి ఉంటుంది.
Tesla’s Optimus robots outperformed their fellow robot, Elon in dancing 😂pic.twitter.com/hLBnvZSPuL
— SMX 🇺🇸 (@iam_smx) November 6, 2025