Leading News Portal in Telugu

Google AI Tools Transform Education for Students in India


  • గూగుల్ ఏఐ టూల్స్‌తో విద్యలో నూతన యుగం ప్రారంభం
  • Gemini, NotebookLM.. విద్యార్థుల కోసం కొత్త అధ్యయన భాగస్వాములు
  • స్మార్ట్ లెర్నింగ్‌ కోసం Google Search‌ లో ఏఐ ఆధారిత ఫీచర్లు
  • టెక్నాలజీతో కలసి సాగే భవిష్యత్‌ విద్య.. ఒక విప్లవాత్మక మార్పు

Google AI Tools: ఒకప్పుడు విద్య అంటే పుస్తకాల పేజీలను తిప్పుకుంటూ చదవడం, చేతితో నోట్లు రాయడం, అర్థం కాకపోయినా కంఠస్థం చేసుకోవడం అనే కఠినమైన ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాలం మారిపోయింది. కృత్రిమ మేధస్సు (AI) రావడంతో విద్యా ప్రపంచం పూర్తిగా కొత్త దిశలో పయనిస్తోంది. విద్యార్థులు ఇప్పుడు కేవలం కష్టపడడం కాకుండా, తెలివిగా నేర్చుకునే మార్గాలను అవలంబిస్తున్నారు.

విద్యార్థులందరికీ గూగుల్‌ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తోంది. సంస్థ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, భారత్‌లో ఇప్పటికే రెండు మిలియన్లకు పైగా విద్యార్థులు గూగుల్‌ AI ప్రో స్టూడెంట్ ఆఫర్ కింద ఉచితంగా సదుపాయాలను పొందుతున్నారు. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు గూగుల్‌ అత్యాధునిక ఏఐ టూల్స్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్రకారం, ఈ టూల్స్ కేవలం తక్షణ సమాధానాలు ఇవ్వడానికే కాదు, విద్యార్థులు విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడంలో, ఆలోచనలను విస్తరించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టూల్స్ రూపకల్పనలో మానవులు ఎలా నేర్చుకుంటారన్న శాస్త్రీయ పద్ధతులను ఆధారంగా తీసుకున్నారని సంస్థ చెబుతోంది.

గూగుల్‌ ఇటీవల విద్యార్థుల కోసం రూపొందించిన మూడు ప్రధాన ఏఐ సాధనాలు.. Gemini, NotebookLM, Google Search.. విద్యలో కొత్త మార్పులకు దారితీశాయి. Gemini టూల్ విద్యార్థులకు మార్గదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇది కేవలం ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాకుండా, సమస్యను చిన్న చిన్న దశల్లో విభజించి, విద్యార్థి స్వయంగా ఆలోచించేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్‌లో ఇరుక్కుంటే, “ఇది సమాధానం” అని చెప్పకుండా “ఈ అనుమానం మార్చితే ఏమవుతుంది?” అని ప్రశ్నించి, సమస్య పరిష్కారం వైపు నడిపిస్తుంది.

Gemini లోని Smart Prep టూల్స్ విద్యార్థులకు పరీక్షల కోసం సులభంగా సన్నద్ధం కావడంలో సహాయపడతాయి. క్లాస్ నోట్స్, నోట్బుక్ ఫోటోలు లేదా టyped టెక్స్ట్ ద్వారా ఫ్లాష్‌కార్డ్స్, క్విజ్‌లు, స్టడీ గైడ్స్‌ను తక్షణమే రూపొందించవచ్చు. ఇక Gemini Live ఫీచర్ ద్వారా వాయిస్, కెమెరా సపోర్ట్‌తో విద్యార్థులు నేరుగా మాట్లాడి నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, జియోమెట్రీ ప్రాబ్లమ్‌పై కెమెరా చూపించి “తర్వాతి స్టెప్ ఏంటి?” అని అడిగితే, వెంటనే దశల వారీగా వివరాలు లభిస్తాయి.

CM Revanth Reddy : కేటీఆర్‌ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు..!

మరో శక్తివంతమైన సాధనం NotebookLM. ఇది పరిశోధన లేదా రీసెర్చ్‌లో నిమగ్నమైన విద్యార్థులకు చాలా ఉపయోగకరం. పెద్ద డాక్యుమెంట్లు లేదా రీసెర్చ్ పేపర్స్‌ను అప్‌లోడ్ చేస్తే, NotebookLM వాటిని సులభమైన భాషలో ఆడియో లేదా వీడియో సమరీలుగా మారుస్తుంది. విద్యార్థులు వాటిని వినిపించుకోవచ్చు, చూసుకోవచ్చు. అంతేకాదు, మైండ్ మ్యాప్‌ల ద్వారా ఆలోచనల మధ్య సంబంధాలను విజువల్‌గా చూపించి, విషయాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తమ నోట్స్, PDFs లేదా స్లైడ్స్ అప్‌లోడ్ చేస్తే, NotebookLM వాటి ఆధారంగా ఫ్లాష్‌కార్డ్స్, క్విజ్‌లు, స్టడీ గైడ్స్‌ను తయారు చేస్తుంది. ఈ విధంగా విద్యార్థుల సిలబస్‌నే ఇంటరాక్టివ్‌గా మార్చేస్తుంది.

ఇదే సమయంలో Google Search కూడా ఏఐ సపోర్ట్‌తో మరింత తెలివైన విద్యా సాధనంగా మారింది. Lens in AI Mode ద్వారా విద్యార్థులు పుస్తకం లేదా డయాగ్రామ్ ఫోటో తీసి, దాని గురించి ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఫోటో తీసి “ఇదిప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది?” అని అడిగితే, గూగుల్ సెర్చ్ వెంటనే వివరణాత్మక సమాధానం ఇస్తుంది. అంతేకాదు, Search Live ఫీచర్ ద్వారా విద్యార్థులు వాయిస్ లేదా కెమెరా ద్వారా రియల్‌టైమ్‌లో సహాయం పొందవచ్చు.

ఈ మార్పులన్నీ చూస్తుంటే విద్య ఇప్పుడు మరింత ఆసక్తికరంగా, ఇంటరాక్టివ్‌గా మారిందని స్పష్టమవుతోంది. విద్యార్థులు తమ స్వంత నోట్స్ ఆధారంగా నేర్చుకోవచ్చు, ఆడియో–విజువల్ పద్ధతుల్లో విషయాలను అర్థం చేసుకోవచ్చు, భాషా అవరోధాలను దాటవచ్చు. అయితే, ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. ఈ ఏఐ టూల్స్ మార్గనిర్దేశం చేస్తాయి కానీ కష్టపడి నేర్చుకోవడం, దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో వ్యవహరించడం మాత్రం విద్యార్థులే చేయాలి.

మొత్తం మీద, గూగుల్‌ ఏఐ సాధనాలు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. అవి విద్యను సులభం చేస్తూనే, ఆసక్తికరంగా మార్చుతున్నాయి. కానీ విద్యార్థి ఉత్సాహం, మానవ ప్రేరణ, భావోద్వేగ మద్దతు మాత్రం ఎప్పటికీ అపూర్వమే.

Private Colleges : చర్చలు సఫలం.. రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు