OPPO Find X9, Find X9 Pro: గ్లోబల్ లాంచ్ తర్వాత ఒప్పో (OPPO) సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Find X9, Find X9 Pro భారతదేశంలో నవంబర్ 18న విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన టీజర్‌లను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. భారత మార్కెట్‌లో Find X9 టైటానియం గ్రే (Titanium Grey), స్పేస్ బ్లాక్ (Space Black) అనే రెండు రంగులలో లభించనుంది. ఇక Find X9 Pro మోడల్ సిల్క్ వైట్ (Silk White), టైటానియం చార్‌కోల్ (Titanium Charcoal) రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన మ్యాట్ గ్లాస్ ఫినిష్, మ్యాట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. Find X9 కాంపాక్ట్ డిజైన్‌తో కూడిన 6.59 అంగుళాల 1.5K 120Hz AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండగా.. Find X9 Pro మరింత పెద్దదైన 6.78 అంగుళాల 1.5K 120Hz LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లలో నాలుగు వైపులా 1.15mm పరిమాణంలో అతి సన్నని బెజెల్స్ ఉండడం విశేషం.
WPL 2026: డబ్ల్యూపీఎల్‌లో ఆడేందుకు ట్రాన్స్‌జెండర్ ప్రయత్నాలు.. ఆర్‌సీబీ కిట్ బ్యాగ్‌తో అనయ!
ఇక కెమెరా విభాగంలో ఒప్పో కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ సొల్యూషన్ అయిన LUMO ఇమేజ్ ఇంజిన్‌తో ఆధారితమైన లేటెస్ట్ హాసెల్ బ్లాడ్ మాస్టర్ కెమెరా సిస్టమ్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా Find X9 Pro లో హాసెల్ బ్లాడ్ తో కలిసి సెన్సార్ కాలిబ్రేషన్, ఆప్టికల్ డిజైన్‌లో రూపొందించిన 200MP హాసెల్ బ్లాడ్ టెలిఫోటో లెన్స్ ఉంది. ఈ ఫోన్‌లు 4K 120fps వద్ద డాల్బీ విజన్‌లో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. అదనంగా, ACES మద్దతుతో LOG రికార్డింగ్, స్టేజ్ మోడ్, AI సౌండ్ ఫోకస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు లేటెస్ట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో రానున్నాయి.
IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచలనం.. సీఎస్‌కేలోకి సంజు, జడేజా ఔట్!
ఇక బ్యాటరీ టెక్నాలజీలో కూడా ఒప్పో ముందంజ వేసింది. Find X9 లో 7025mAh, Find X9 Pro లో 7500mAh సామర్థ్యం గల ఒప్పో సంబంధిత అధునాతన మూడవ తరం సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని ఇందులో ప్యాక్ చేసింది. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 తో వస్తాయి. ColorOS 16 భారతీయ విడుదల వివరాలు ఈ నెలాఖరులో జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.