Leading News Portal in Telugu

RS 20000 Discount on Samsung Galaxy S25 Edge on Vijay Sales, Here is Full Details


  • మే 13న గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ రిలీజ్
  • శాంసంగ్‌ స్లిమ్మెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌
  • గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌పై 20 వేల తగ్గింపు

కొన్ని నెలల క్రితం భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్‌లో దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్‌’ తన స్లిమ్మెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత మే 13న ఎస్‌25 సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌’ను శాంసంగ్‌ రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌కు మొబైల్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. అయినా కొన్ని నెలలోనే ఈ హ్యాండ్‌సెట్ ధర భారీగా తగ్గించబడింది. ఈ స్లిమ్మెస్ట్‌ ఫోన్‌పై ఏకంగా 17 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ అదనంగా అందుబాటులో ఉంది. దాంతో మీరు డెడ్ చీప్‌గా ‘గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ను ఇంటికి తీసికెళ్ళిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

లాంచ్ సమయంలో గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ 12జీబీ+256జీబీ స్టోరేజీ బేస్‌ వేరియంట్‌ ధరను రూ.1,09,999గా శాంసంగ్‌ కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ విజయ్ సేల్స్‌లో రూ.98,644కు లిస్ట్ చేయబడింది. అంటే మీరు 10 శాతం ఆదా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫుల్ స్వైప్‌పై ఫ్లాట్ రూ.8,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. మొత్తంగా మీరు దాదాపుగా 20 వేల తగ్గింపును పొందవచ్చు. గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ను దాదాపుగా 90 వేలకు మీరు కొనుగోలు చేయొచ్చు. అలానే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ మీ మొబైల్‌ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ ఫోన్‌ అత్యంత నాజూకైన, అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్‌ కంపెనీ యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫోన్ కేవలం 5.8 మిల్లీమీటర్ల మందంతో రావడం విశేషం. ఇది 6.7 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-O డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ స్క్రీన్‌తో వచ్చింది. 120Hz రిఫ్రెష్‌ రేటు, కార్నింగ్‌ గ్లాస్‌ గొరిల్లా సిరామిక్‌ 2 ప్రొటెక్షన్‌, IP68 రేటింగ్‌ ఉంది. క్వాల్‌కామ్‌ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌యూఐ 7తో పని చేస్తుంది.

గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200MP ఫ్రంట్ కెమెరా, 12MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 3,900mAh బ్యాటరీని ఇవ్వగా.. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 25W వైర్డ్‌ ఛార్జర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫై7, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ టైటానియం ఐసీబ్లూ, టైటానియమ్‌ జెట్‌ బ్లాక్‌, టైటానియమ్‌ సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.