Fire-Boltt Ninja Call Pro Plus: స్మార్ట్‌వాచ్ ప్రియులకు నిజంగా పండుగ లాంటి విషయమే.. ప్రముఖ బ్రాండ్ Fire-Boltt తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌లలో ఒకటైన నింజా కాల్ ప్రో ప్లస్ (Ninja Call Pro Plus (మోడల్ నంబర్: BSW053)పై నమ్మశక్యం కాని ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా అధిక ధర ఉండే ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే డీల్‌లో ఏకంగా 95% తగ్గింపుతో కేవలం రూ.998 కే అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ స్మార్ట్‌వాచ్ కొనాలనుకునేవారికి గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
OnePlus 13R Price Drop: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. డెడ్ చీప్‌గా లేటెస్ట్ ‘వన్‌ప్లస్ 13ఆర్’, డోంట్ మిస్!
ఇక ఈ Fire-Boltt Ninja Call Pro Plus యొక్క అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి దాని బ్లూటూత్ కాలింగ్ సామర్థ్యం. ఇందులో మైక్, స్పీకర్ కూడా పొందుపరిచారు. దీని ద్వారా నేరుగా వాచ్ నుండే కాల్స్ మాట్లాడవచ్చు. ఇక ఇందులో 1.83-అంగుళాల (240×280 రిజల్యూషన్) పెద్ద HD LCD డిస్‌ప్లే, 280 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ఇది 128 MB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. WatchOS ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.
ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం ఈ వాచ్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. హెల్త్ సెన్సార్లు SpO2 (బ్లడ్ ఆక్సిజన్ పర్యవేక్షణ) మరియు హృదయ స్పందన రేటు (Heart Rate Tracking) ట్రాకింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో ఇందులో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. యాక్టివిటీ ట్రాకర్, క్యాలరీ ట్రాకర్, పెడోమీటర్, స్లీప్ మానిటర్, సెడెంటరీ రిమైండర్, డెయిలీ వర్కౌట్ మెమొరీ వంటివి ఇందులో ఉన్నాయి.
OnePlus 13R Price Drop: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. డెడ్ చీప్‌గా లేటెస్ట్ ‘వన్‌ప్లస్ 13ఆర్’, డోంట్ మిస్!
ఈ వాచ్ మన్నిక పరంగా కూడా ముందుంది. ఇది IP67 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంది. అంటే చెమట, నీటి తుంపరల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే AI వాయిస్ అసిస్టెంట్ మద్దతుతో, సులభంగా పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇంకా అలారం క్లాక్, గేమ్స్, మ్యూజిక్ ప్లేయర్, నోటిఫికేషన్స్ మరియు ‘ఫైండ్ ఫోన్’ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్ రంగులో సిలికాన్ మెటీరియల్‌తో వస్తుంది. దీని బరువు కేవలం 46 గ్రాములు మాత్రమే.